PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దేవరగట్టు శ్రీ మాళ సహిత మల్లేశ్వరస్వామి అత్యంత మహిమాన్విత శైవక్షేత్రం

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : బన్నీ ఉత్సవాల సందర్భంగా నేరణికి, నేరణికి తండా,కొత్తపేట గ్రామ ప్రజలు స్వామివారి కటాక్షం కోసం నెల రోజుల పాటు నియమ నిష్ట ఆచరిస్తారు. ఉత్సవాలు మొదలవ్వడానికి ముందు అమావాస్య నుంచి ఉత్సవాలు ముగిసే వరకు మద్యం ముట్టరు, మాంసం తినరు. అలాగే దాంపత్య జీవితాన్నికి దూరంగా ఉంటారు. ఈ ఆచార నియమాలు తమ తాత మూతాతల నుంచి సంప్రదాయంగా వచ్చిందని మూడు గ్రామాల ప్రజల మాట. స్వామివారి ఉత్సవాలో నిష్ఠతో ఉంటేనే దైవ కార్యంలో ఉన్నట్లని, ఉత్సవాలు విజయవంతం అవుతాయని ఆ మూడు గ్రామ ప్రజల నమ్మకం. స్వామివారి చరిత్ర ఇలా:-దేవరగట్టు శ్రీ మాళ సహిత మల్లేశ్వరస్వామి అత్యంత మహిమాన్విత శైవక్షేత్రం. దాదాపు దేవరగట్టు కొండల్లో 800 అడుగు ఎత్తుల్లో గల గిరి పై కొండ గుహల్లో శ్రీ మాళ సహిత మల్లేశ్వరస్వామి కూర్మావతరంలో స్వయంభువుగా వెలిశారు. గుహల్లో కుర్మావతరంలో వెలసిన శ్రీ మాళ సహిత మల్లేశ్వరస్వామి కొండ కూడా “కూర్మ ఆకారంలో” ఉండటం ఇక్కడి విశేషం. శ్రీ మాళ సహిత మల్లేశ్వరస్వామి కొండకు ఓ విశేషం కలదు. ఆ చరిత్ర ఇలా. ఉంది… పూర్వం దేవరగట్టు కొండా ప్రాంతంలో ఋషులు, మునులు లోకకల్యాణం కొరకు యజ్ఞయాగాలు, జపతపలు చేస్తు ఆధ్యాత్మికంగా భక్తి వైరాగ్యాలతో గడిపే సమయంలో మణి,మలాసుర అనే రాక్షసులు వారి యజ్ఞ. యాగలకు భగ్నం చేసి వారి పై దాడులు చేస్తూ రుషి, మునులను హింసించేవారు. ఆ సమయంలో రాక్షసుల నుంచి రక్షణ కల్పించాలని ఆదిదంపతులైన పార్వతి, పరమేశ్వరులతో మొర పెట్టుకోవడం జరిగింది. వారి మొరను ఆలకించిన స్వామి, అమ్మవార్లు తాబేలు(కూర్మం) ఆకారంలో గల కొండ ప్రాంతంలోని గిరి పైన గల గుహలో కూర్మాకారంలో స్వయంభువుగా వెలిశారు. అక్కడి నుంచి మణి, మలసురులనే రాక్షసులతో ఈ కొండ ప్రాంతంలో యుద్ధం చేసి వారిని హతమార్చిరు. అది కూడా దసరా (విజయదశమి) పండుగ రోజునే జరిగిందని చరిత్ర చెబుతోంది. అయితే మణి, మలసురులు చనిపోయే సమయంలో పార్వతి, పరమేశ్వరులను వరం కోరారని ఆ కోరిన వరంలో దేవరగట్టు ఉత్సవాలకు వచ్చే మానవులను ఆహారంగా ఇవ్వాలని కోరారు. ఈ కోరికకు పరశివుడు తథాస్తు అనే సమయంలో మాత మాళమ్మ అడ్డుపడి పరమేశ్వర… ఆగు… అంటూ రాక్షసులు కోరిన వరం అర్ధం చేసుకోకుండా వరం ఇవ్వడం తప్పు అని ప్రతి సంవత్సరం మన కోసం జరిగే జాతర మహోత్సవాలకు…. మన దర్శనం కోసం వచ్చే భక్తులను ఆహారంగా ఇవ్వమని కోరుతున్నారని తప్పుకో… అంటూ పరమేశ్వరుడిని వెనకు లాగి….. పార్వత దేవి ముందుకు వెళ్ళి

మణి, మలసురులకు ఆ వరం ఇవ్వడం కుదరదన్నారు. దానికి

బదులుగా నేరే వరం కోరుకోవలని పార్వత దేవి ఆ రాక్షసులకు చెప్పడంతో…. తాము రాక్షసులమని…. తమకు రక్త బలి కావాలని కోరగా అందుకు ఉత్సవాలకు వచ్చే భక్తులను బలిగా ఇవ్వడం కుదరదని తెలపడంతో… ప్రతి సంవత్సరం నీ భక్తులతో మాకు మట్టి కుండ నిండా రక్తం ఆహారంగా ఇవ్వాలి అని కోరగా. అందుకు పార్వత దేవి ప్రతి సంవత్సరానికి ఒక సారి నా భక్తులతో పిడికెడు రక్తం నీకు ఆహారంగా సమర్పిస్తారని “రక్షపడ” ప్రాంతం వద్ద చెప్పడంతో వరం పొందిన మణి, మలసురులనే రాక్షసులు ప్రాణాలు వదిలినట్లు చరిత్ర. ఆ పిడికెడు రక్తం చిందించడం కోసం ప్రతి సంవత్సరం జరిగే బన్నీ ఉత్సవాలో “రక్షపడ” వద్ద ఆ ప్రాంతంలో ఉన్న గౌరవయ్య అడ్డుపడడంతో రక్షపడ మీదుగా వెళ్లే జైత్రయాత్రల్లో మాళ్ళమ్మ విగ్రహాన్ని తీసుకొని వెళ్లే పూజారి డబ్బనంతో కాలిపిక్కకు పొడుచుకొని పిడికెడు రక్తాన్ని చిందిస్తాడు… ఆ వెంటనే బందారును పట్టించే సమయంలో దుర్… గోపరాక్… అంటూ ముందుకు వెళ్లి పోతారు. ఆ పిడికెడు రక్తం చిందించడమే బన్నీ ఉత్సవాల్లో స్వామి వారి జైత్రయాత్రల్లో కర్రలతో కొట్టుకోవడం తలలు పగలుగోతుకోవడం….. రక్తాన్ని చిందించడమని ఇది తరతరాల నుంచి అనవాయితీగా వస్తుందని చరిత్ర చెబుతుంది. అయితే నాడు రాక్షసులతో జరిగిన యుద్ధంలో యుద్ధానికి వెళ్లే సమయంలో ప్రస్తుతం పిలవబడుతున్న “ముళ్లబండ” అనే ప్రాంతం వద్ద స్వామివారి పాదనికి ముళ్ళు కూచుకోవడంతో ఆ ముళ్ళును తీసుకునేందుకు ఆ బండ పైన సేదతీరారని అందుకే అక్కడ ‘ముళ్లబండ’ అన్ని పిలవడం జరుగుతోంది. అక్కడి నుంచి ముందుకు వెళ్లి స్వామి వారు సేదతీరిన ప్రాంతం కావడంతో స్వామివారి పాదాలకు పూజలు చేశారని దీంతో అక్కడ స్వామివారి పాదాలను ఉంచి ‘పాదల కట్టగా’ పిలుస్తున్నారు. అక్కడి నుంచి మణి, మలాసురులనే రాక్షసులు నివాసం ఉంటున్న రక్షపడ ప్రాంతానికి వెళ్లాడంతో ఆ రక్షపడ వద్ద ఉన్న పెద్ద బండరాళ్ల గుహల్లో మణి, మల్లాసుర రాక్షసులకు ఇచ్చిన వరంను ప్రతి సంవత్సరం కొనసాగిస్తుండడం. అనవాయితిగా వస్తోంది. అలాగే శమి వృక్షం వద్దకు వెళ్ళి అక్కడ సేదతీరి ఉదయం వేకువ జామున ఎదురు బసవన్న గుడికి వెళ్లి అక్కడ భవిష్యతులో జరిగే మంచి, చెడులను, పంటల ధరను స్వామివారు భవిష్యవాణి (కార్డికం)గా వినిపించారని అదే భవిష్యవాణి నేటి వరకు కొనసాగుతూనే ఉంది. అక్కడి నుంచి సింహాసన కట్టకు చేరుకొని సింహానన కట్ట పై కొలువుదీరి భక్తులకు దర్శనమివడంతో బన్నీ ఉత్సవాల్లో కొనసాగిన జైత్రయాత్ర అంతటితో ముగుస్తుంది. మొత్తానికి దేవరగట్టులో దసరా నాడు జరిగే బన్నీ ఉత్సవం అంటేనే ఒళ్ళు గుగుర్పొడిచే విధంగా ఉంటుందని ప్రతి సంవత్సరం దసరా వచ్చిందంటే అందరి కళ్లు దేవరగట్టు కొండల్లో జరిగే జైత్రయాత్ర పైనే దృష్టి ఉంటుంది. అందుకే దేశ వ్యాప్తంగా దసరా నాడు జరిగే ఈ బన్నీ

ఉత్సవం ఎంతో ప్రసిద్ధిగాంచింది.

పాల బాసతో ఉత్సవాలోకి.

నేరణికి, నేరణికి తండా, కొత్తపేట గ్రామ ప్రజలు ఐక్యమత్యంగా అర్ధరాత్రి 12:00లకు డోళ్ళుబండే వద్దకు చేరుకుంటారు. దేవునికార్యార్థమై మనలోని వైషమ్యాలను విడి అన్నదమ్ముల జైత్రయాత్ర దిగ్విజయం చేద్దామని పాలబాసలు చేసి ఒకరికొకరు బన్నీ(బండారు) తీసుకుంటారు. కర్రలు చేతబట్టి కాగడల వెలుతురులో డీర్రర్…. గోపరాక్ అంటూ నిమిషలో 800 ఎత్తులో కొలువైన శ్రీ మాళ మల్లేశ్వరస్వామి గిది పైకి చేరుకుంటారు. ఆలయ పూజారులు శ్రీ మాళ మల్లేశ్వరస్వామి కల్యాణోత్సవం అనంతరం ఉత్సవ మూర్తులను మరియు వల్లకిని కొండ దిగువన ఉన్న సింహాసన కట్ట వద్దకు చేరుస్తారు. అప్పుడే ఐన్నీ మొదలవుతుంది.

నేటి నుంచి దేవరగట్టు ఉత్సవాలు ప్రారంభం,

దేవరగట్టు శ్రీ మాళ సహిత మల్లేశ్వరస్వామి బన్నీ ఉత్సవాలు నేడు నేరణికి గ్రామ పురోహితులు గణపతి పూజ, కంకణధారణ, ధ్వజారోహణ, నిశ్చితార్థం కార్యక్రమాలతో ప్రారంభమయ్యాయి. 12వ తేదీ శనివారం జయదశమి( బన్నీ),స్వామివారికి కల్యాణోత్సవం, జైత్రయాత్ర, రక్షపడి మీదుగా శమివృక్షం చేరడం. అక్కడ ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఉంటాయి. 13వ తేదీ ఆదివారం ఉదయం ఆలయ ప్రధాన అర్చకులచే దైవవాణి(కార్డిక) కార్యక్రమం జరుగుతుంది. 14వ తేదీ సోమవారం ఉదయం నేరణికి పురోహితులచే స్వామివారికి ఇలభిషేకం, రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం, బందార్చన సాయంత్రం 5 గంటలకు స్వామివారి రధోత్సవం, 15వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుంచి గొరవయ్యల నృత్య ప్రదర్శన, గొలుసు తెంపుట, దేవదాసి త్యోత్సవం, వసంతోత్సవం, కంకణ విసర్జన కార్యక్రమాలు జరుగుతాయి. 16వ తేదీ బుధవారం ఉత్సవ విగ్రహా మూర్తులు నేరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయి. బన్నీ ఉత్సవాలకు అన్ని ఏర్పాటు పకడ్బందీగా నిర్వహిస్తాం. ఈ నెల 12న జరిగే బన్నీ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపడుతామని అధికారులు తెలిపారు.

About Author