మార్కెట్ లో ట్యాంక్ ఏర్పాటు చేస్తాం..
1 min read16వ వార్డ్ లో పర్యటించిన కమిషనర్ వైస్ చైర్మన్
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ప్రజల విజ్ఞప్తి మేరకు పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయం పక్కన ఉన్న మార్కెట్ వెనుక భాగాన త్రాగునీటి ట్యాంక్ త్వరలో ఏర్పాటు చేస్తామని మున్సిపాలిటీ కమిషనర్ బేబీ అన్నారు.మంగళవారం ఉదయం నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో మున్సిపాలిటీ కమిషనర్ బేబీ మరియు మున్సిపాలిటీ వైఎస్ చైర్మన్ మొల్ల రబ్బానీ వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ డ్రైనేజీలను శుభ్రం చేయించారు.మార్కెట్ వెనుక త్రాగు నీటి ట్యాంక్ ఏర్పాటు చేయిస్తామని అన్నారు. మార్కెట్ లో ప్రజలతో వారు మాట్లాడారు.త్వరలో మార్కెట్ ను అభివృద్ధి చేస్తామని కమిషనర్ మరియు వైస్ చైర్మన్ మొల్ల రబ్బానీ అన్నారు.తర్వాత చౌడేశ్వరీ గుడి ఎదురుగా ఉన్న కాలువ దగ్గర డ్రైనేజీని కార్మికులతో తొలగించారు.16వ వార్డులో వార్డు ఇన్చార్జి లింగాల శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ముబారక్ ఫంక్షన్ హాల్ వెనుక అపరిశుభ్రంగా ఉండడం ఆ కాలనీల నుంచి మురుగు నీరు ఫంక్షన్ హాల్ వెనక గుంతలో విపరీతంగా మురుగునీరు ఉండడం వల్ల దోమలు దుర్వాసన వస్తూ ఉండడంతో రోగాలు ప్రబలుతున్నాయని కాలనీ వాసులు కమిషనర్ చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు.ఇక్కడ ప్రతి రోజు శానిటేషన్ పనులు చేయిస్తామని అంతేకాకుండా బ్లీచింగ్ పౌడర్ వేస్తామని కాలనీ ప్రజలకు హామీ ఇస్తూ అక్కడ శుభ్రం చేయించారు.నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి మరియు ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఆదేశాల మేరకు వారు పర్యటించారు.ఈ కార్యక్రమంలో ఉపేంద్ర,సోషల్ మీడియా ప్రతినిధి పసుల శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు.