చైనాలో సెపక్ తక్రా క్రీడలో తళుక్కుమన్న ఆలూరు క్రీడాకారుడు కురువ మధు
1 min readఘనంగా సన్మానించిన మదాసి&మదారి కురువ సంఘం కమిటీ సభ్యులు
పల్లెవెలుగు వెబ్ ఆలూరు: ఆలూరు నియోజకవర్గం కేంద్రంలో ఉన్న అతిథి గృహంలో ఆలూరు తాలూకా మదాసి మదారి కురువ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మన భారత జట్టు తరఫున సెపక్తక్రా ఆటలో అంతర్జాతీయ క్రీడకు భారత జట్టు తరుపున నాయకత్వం వహించిన ఆలూరు నివాసి కురువ మధు చైనాలో ఆడిన ఆటలో క్యాoస పథకం సాధించడం జరిగింది ఈ శుభ సందర్భంగా ఆలూరు నియోజకవర్గం మాదాసి మదారి కురువ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో కురువ మధును ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ సెపక్తక్రా క్రీడాకారుడు కురువ మదుకు మా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఇంకా అంచలంచలుగా ఎదగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని కర్నూలు జిల్లాలో మారుమూల నియోజకవర్గమైన ఆలూరులో అంతర్జాతీయ స్థాయికేదగడం మా నియోజకవర్గ ప్రజలు గర్వించదగ్గ విషయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో మదాసి కురువ సంఘం,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్మోహన్, తాలూకా గౌరవ అధ్యక్షుడు రంగన్న,కన్వీనర్ కౌడికే రాజు, కర్నూలు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బావ శేషప్ప,కురుబ కార్పోరేషన్ మాజీ డైరెక్టర్ బజారప్ప,ఎండి హళ్లి సర్పంచ్ సుధాకర్,తాలూకా ప్రధాన కార్యదర్శి మల్లయ్య,టిడిపి యువ నాయకుడు బెలగంటి కురువ హనుమప్ప,మాజీ సర్పంచ్ మల్లికార్జున,ఎల్లార్తి సర్దార్,తిప్పేశా,ఆరికేరి చంద్ర,లింగమూర్తి,రాజు, ఆనంద్,బసవరాజు,గోబీ బసవరాజు,పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.