మానసిక ఒత్తిడి నివారణ పేరుతో చెడు అలవాట్లకు లోను కావద్దు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సాయి సుధీర్ అన్నారు. బుధవారం మానసిక వైద్యుల విభాగం లో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక రూపంలో ఒత్తిడి ఉంటుందని ఒత్తిడి నివారణ పేరుతో చెడు అలవాట్లకు లోను కాకూడదు అని ఆ సమయంలో మానసిక వైద్యులను సంప్రదించాలని కోరారు. సైకియాట్రి డిపార్ట్మెంట్ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ పని ప్రదేశంలో ఒత్తిడికి దూరంగా ఉండాలని, మానసిక వైద్యుల్ని సంప్రదించిన ప్రతి ఒక్కరు మానసిక రోగులు కారని మానసిక వైద్య విభాగం ఎన్నో రకాల సేవలను అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య విద్యార్థులకు, నర్సింగ్ విద్యార్థులకు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని ఏర్పాటుచేసిన వివిధ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతి ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు గంగాధర్ నాయక్, డా యతిరాజు, డాక్టర్ చంద్రశేఖర్, సీనియర్ రెసిడెంట్స్ డా.మౌనిక, డా. రోషిణి, యన్.టి.సి.పి.సైకాలజిస్ట్ చంద్రశేఖర్,పి.జి విద్యార్థులు పాల్గొన్నారు.