మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారికి మహా సరస్వతి దేవిగా అలంకరణ
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో కర్నూలు శ్రీ సూర్య నారాయణ స్వామి దేవాలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి సందర్బంగా ఈ రోజు ప్రాతఃకాలంలో శ్రీ మహాగౌరీ అమ్మవారికి విశేష అభిషేకము, అర్చనలు జరిగినవి. మహా గౌరీ అమ్మవారిని మూలా నక్షత్రం సందర్భంగా మహా సరస్వతి దేవిగా అలంకరించి. మంటపారాధన దేవి ఖడ్గమాల లలితా సహస్రనామాలతో అర్చన చేయడం జరిగినది. నవరాత్రులలో భాగంగా ఈరోజు కర్నూలు జిల్లా S P గరికపాటి బిందు మాధవ్ కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకుని పూజలో పాల్గొన్నారు ఆలయ అర్చకులు వారికి మొమెంటో మరియు శాలువాతో సత్కరించారు అర్చకులు వారిని ఆశీర్వదించారు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు . అనంతరం నవ చండి హోమం భాగంగా చండీహోమం జరిగినది. సాయంత్రం శ్రీ మహా గౌరీ అమ్మవారికి ప్రదోషకాలార్చన, లలితా సహస్రనామార్చన, శ్రీ సరస్వతి అష్టోత్తర పూజలు, మరియూ పుస్తక స్వరూప సరస్వతీ పూజలు, సామూహిక కుంకుమార్చనలు, చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమము జరిగినవి. అనంతరం విద్యార్థులకు పుస్తకములు, పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్లు, చాక్లెట్లు పంచబడినవి. ఇందులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ప్రసాద వితరణ జరిగినది.