PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చౌరస్తా హనుమాన్ టెంపుల్ లో తాండవిస్తున్న దేవాదాయ శాఖ అసమర్థత

1 min read

హిందూ ఆలయ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భారీగా నిరసన

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు  బళ్లారి చౌరస్తా నందు వెలసిన శ్రీ హనుమాన్ ఆలయం నందు సుచి శుభ్రత లేకుండా ఆలయ ప్రాంగణం అంతా చెత్తా చెదారంతో మరియు కర్నూలు కు ఎంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన హనుమాన్ విగ్రహం కళావిహీనమై రంగు తేలి చాలా అసహ్యంగా కనిపిస్తుంది అంటూ దీనికి పూర్తిగా ఆలయ నిర్వహణ అధికారి జమ్ములమ్మ బాధ్యత వహిస్తూ తక్షణమే విధులనుంది తప్పుకోవాలని హిందూ ఆలయ ధర్మ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయులు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ ఆలయానికి సంబంధించి ప్రహరీ గోడ లేదని ఇనుప కంచే ఉందని అదికూడా చాలా మటుకు పాడైపోయిందని అందులోంచి పందులు కుక్కలు పందికొక్కులు ఆలయం లోకి ప్రవేశించి పరిసరాలను అపరిశుబ్రం చేస్తున్నాయని  ఇక తాగు నీరు కు కూడా సరైన సదుపాయాలు లేవని ముఖ్యంగా హనుమాన్ విగ్రహం రంగులు తేలి దుమ్ము ధూళితో కళావిహీనమై చాలా అసహ్యంగా కనిపిస్తుందని ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని తక్షణమే దీనికి రంగులు వేసి విగ్రహానికి పూర్వకలను తీసుకురావాలని  వెల్లడించారు అలాగే ఆలయ అధికారిని  అక్కడ జరిగే అన్ని కార్యక్రమాలను సజావుగా జరిపించాల్సిన బాధ్యత ఉంటుందని కేవలం చుట్టపు చూపుగా వచ్చిపోతూ కంటికి కనిపిస్తున్న ఏమి ఎరగనట్లు తనకు పట్టనట్టు వ్యవహరించడం చాలా బాధాకరమని ఈ పద్ధతి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఆమె ప్రవరిస్తున్నదని తెలియచేశారు .అలాగే  కొందరు భక్తులు ఆలయంలో జరిగే అవినీతిని ఎలాగైనా నిలువరించాలని ఒకే టోకెన్ పై మూడుసార్లు పూజలు జరిపిస్తారని ఈ తతంగమంతా కల్లారా చూసామని వాహన పూజకు ఇచ్చిన టోకెన్లు పూజానంతరం మళ్లీ అదే టోకెన్లు వేరొకరికి ఇస్తున్నారని ఇలా మేము ఆంజనేయ స్వామి మాలలు ధరించినప్పుడు కల్లారా చూసామని మాలలో ఉన్నందుకు మేము ఏమి చెప్పలేకపోయామని ఇక ఆ ఇనుపకంచ నుంచి పందులు వచ్చి పరిసరాలను అభివృద్ధి చేస్తున్నాయని ఇది ఒక క్రమ పద్ధతిలో నడవడం లేదని దయచేసి భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా నియమ నిష్ఠలతో ఆలయాన్ని నడిపించాలని ఎండోమెంట్ వారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నానని తెలియజేశారు అలాగే ఇంకొక భక్తుడు అన్నదానానికి సంబంధించి చాలా అవినీతి జరుగుతుందని భక్తులు ఇచ్చిన విరాళాలు కాకుండా బియ్యం ప్యాకెట్లు ఆయిల్ ప్యాకెట్లు బ్యాళ్ళు తదితర వస్తువులను బయటకు తీసుకువెళ్లి అమ్ముకుంటున్నారని ఇది కచ్చితంగా దాతలను మోసం చేయడమేనని ఇలా చేస్తే దాతలు ఎలా ముందుకు వస్తారని భక్తులకు అన్నదానాలు ఎలా జరుగుతాయని ఇది నిలువరించాల్సిన ఆవశ్యకత చాలా ఉందని దీనిపై చర్యలు తీసుకొని దాతలు ఇచ్చిన వివరాలను గోప్యంగా కాకుండా బహిర్గతంగా ఉంచి కచ్చితంగా ప్రతి ఒక్క భక్తునికి తెలియజేయాల్సిన అవసరం చాలా ఉందని తెలియజేశారు. ఆలయ అధికారులు తీరు మరియు దేవాదాయ శాఖ అధికారుల తీరు ఇలాగే కొనసాగితే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి అసిస్టెంట్ కమిషనర్ ఆఫీస్ ముట్టడిస్తామని అలాగే భక్తులతో కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి అక్కడి నుండి దేవాదాయ శాఖను తీసివేసేంతవరకు ఉద్యమాలను కొనసాగిస్తామని తెలియజేశారు అలాగే ఈ కార్యక్రమంలో శేఖర్, మధు, బ్రహ్మయ్య, విజయ్ ,రాము, ప్రవీణ్ కుమార్ ,గంగాధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *