సాగునీటి ప్రాజెక్టుల పూర్తి కై ప్రభుత్వం చొరవ చూపాలి ..
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: జిల్లాలో నిరాదరణ కు గురైన సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ ఆ పార్టీ జిల్లా నాయకులు బి వీర శేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం నాడు మండలములోని తెర్నేకల్ సిపిఎం గ్రామ శాఖ మహాసభ కే.పరమేష్ అధ్యక్షతన నిర్వహించారు. అంతకుముందు పార్టీ కార్యాలయం దగ్గర ఉన్న అరుణ పతాకాన్ని పార్టీ సీనియర్ కామ్రేడ్ శ్రీనివాసులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కరవు, కాటకాలకు నిలయమైన కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టుల పూర్తి కొరకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. గత ప్రభుత్వం లో నిరాదరణ గురైన సాగునీటి ప్రాజెక్టులు సత్వర పూర్తికై కృషి చేయాలని అన్నారు. హంద్రీనీవా మొదటి దశ పూర్తి విస్తరణ పనులు అదేవిధంగా గురు రాఘవేంద్ర ,వేదవతి, గుండ్రేవుల ,తుంగభద్ర పై సమాంతర కుడి కాలువ వంటి సాగునీటి ప్రాజెక్టులపై పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. రైతుల శ్రేయస్సు ప్రజా శ్రేయస్సు కొరకు మౌలిక సదుపాయాల సమకూర్చడంలో ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. ఈ శాఖ మహాసభల్లో తేర్నకల్ గ్రామ కార్యదర్శిగా మహబూబ్ బాషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు బజారి ,కె.పి రాముడు లక్ష్మిరెడ్డి ,రాజశేఖర్ రెడ్డి ,రవి లోకయ్య తదితరులు పాల్గొన్నారు.