ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : మధు హాస్పిటల్ వారి సౌజన్యముతో ఎన్.టి.ఆర్ సేవా సమితి వారి సహకారంతో బస్టాండులోని స్థానిక కన్నడ పాఠశాలలో నిర్వహించిన ఉచిత గుండె వైద్య శిబిరం విజయవంతమైంది.వైద్య శిబిరంలో మధు హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి. మనోజ్ కుమార్ రెడ్డి సూచనతో ప్రముఖ గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ విశ్వనాధ్ ఎం. డి. గారిచే దాదాపు 90 మందికి హృదయ సంబంధిత సమస్యలకు ఉచిత చికిత్స,మందులను కూడా అందించడం జరిగింది. మరియు దాదాపు 35 మందికి గుండె పరీక్ష ఉచిత ఈ.సి.జి స్క్యానింగ్ ను నిర్వహించడం జరిగింది.అంతేకాకుండా గుండె సంబంధిత జబ్బుల మరింత మెరుగైన చికిత్సకై అవసరమై ఆసక్తి కలిగిన వారికి ఎన్.టీ.ఆర్ వైద్యసేవా ద్వారా సంపూర్ణ ఉచిత చికిత్స మరియు ఆపరేషన్ లను నిర్వహించడం జరుగుతుందని ఈ సదావకాశాన్ని హొళగుంద మండల ప్రజలు సద్వినియోగ పర్చుకోవాలని తెలిపారు.
ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న
మాజీ తెలుగుయువత రాష్ట్ర కార్యదర్శి చిన్నహ్యట శేషగిరి గారు మాట్లాడుతూ మధు హాస్పిటల్ వారి సౌజన్యము మరియు ఎన్.టీ.ఆర్ సేవాసమితి-హొళగుంద వారి సహకారంతో నేటి వైద్య శిబిరం మేజర్ గుండె జబ్బుల పరిష్కారానికి ఎంతో ప్రయోజనకరమైనదని మరియు మండల ప్రజల ఆరోగ్య సంరక్షణకై ఉచిత వైద్య శిబిరాల నిర్వహణకు మండలంలోని వివిధ సంఘాలు, పార్టీలు, యువత ప్రత్యేక ఆసక్తిని కనబర్చాని కోరుతూ మధు హాస్పిటల్స్ వారికి మండల ప్రజల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు.తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య గారు మాట్లాడుతూ హొళగుంద మారుముల ప్రాంతంలో రోజురోజుకు జనాభా మరింతగా పెరిగిపోతున్న తరుణంలో ప్రజల ఆరోగ్యరిత్య వారి మెరుగైన చికిత్స మరియు సురక్షతల కొరకు పట్టణాలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నదని ఇలాంటి సందర్భంలో మధు హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరపు సేవలు ఎంతో ప్రజోపయోగమైనవని వివరిస్తూ, వైద్య శిబిరపు వైద్య బృందానికి మరియు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపి తెలిపారు.ఉచిత వైద్య శిబిరంలో ఎన్.టీ.ఆర్ సేవా సమితి మండల అధ్యక్షులు ఎల్లార్తి అర్జున్, ఉపాధ్యక్షులు పెద్దహ్యట వీరేష్ టిడిపి సీనియర్ నాయకులు దుర్గయ్య టిడిపి మైనార్టీ నాయకులు కే. ఖాదర్ బాష, టిడిపి నాయకులు కురువ మల్లికార్జున, నూరాని మస్జీద్ పండితులు హాఫీజ్ మహమ్మద్ కబీర్ మరియు ఎన్.టీ.ఆర్ అభిమానులు గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.