11వ తేదీ వరకు మద్యం షాపులకు దరఖాస్తులు
1 min readమండల కేంద్రాల్లో మద్యం ఫ్లెక్సీల ఏర్పాటు
ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని నందికొట్కూరు, పగిడ్యాల,మిడుతూరు, జూపాడుబంగ్లా మండల కేంద్రాల్లో ప్రభుత్వం ప్రకటించిన 10 మద్యం దుకాణాలకు గాను నిన్న సాయంత్రం వరకు 136 దరఖాస్తులు వచ్చినట్లు నందికొట్కూరు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సీఐ ఎస్ రామాంజనేయులు తెలిపారు.మద్యం షాపులకు వచ్చిన దరఖాస్తులు:నందికొట్కూరు పట్టణం నాలుగు షాపులకు గాను 56,నందికొట్కూరు రూరల్ రెండు షాపులకు 9,జూపాడుబంగ్లా:47, మిడుతూరు 9,కడుమూరు 9,పగిడ్యాల:6 దరఖాస్తులు వచ్చాయని అన్నారు.ఎక్సైజ్ సీఐ ఆధ్వర్యంలో వివిధ మండల కేంద్రాల్లో ప్రజలు ఎక్కువగా తిరిగే ప్రదేశంలో మద్యం షాపుల గురించి తెలుసుకునే విధంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ ప్రజలకు మద్యం షాపుల పై అవగాహన కల్పించారు. ఈనెల 11వ తేదీ రాత్రి 7 గంటలకు ముగుస్తుందని మద్యం షాపులపై దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు.అదేవిధంగా స్టేషన్ ముందు డిస్ ప్లే బోర్డు ఏర్పాటు చేసి గంట గంటకు ఏఏ దుకాణాలకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయో అందులో పేర్కొనడం జరుగుతుందని దీనివల్ల ప్రజలకు పారదర్శకంగా సమాచారం అందించినట్లుగా ఉంటుందనే ఉద్దేశంతో డిస్ ప్లే బోర్డులను ఏర్పాటు చేసినట్లు సీఐ తెలిపారు.ఈ పాలసీ లైసేన్సీ దారులకు లాభాల పంట గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ నూతన మద్యం పాలసీ 2024-26లో 20% మార్జిన్ ఇవ్వడం వలన ఒక మద్యం దుకాణంలో 10 కోట్ల వ్యాపారం జరిగినట్లయితే దుకాణ లైసెన్సీ దారుడికి రెండు కోట్ల రూపాయలు మార్జిన్ రూపంలో వస్తుందని కావున వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎక్సైజ్ సీఐ గురువారం తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐ జఫురుల్లా సిబ్బంది పద్మనాభం,కుమారి శివన్న పాల్గొన్నారు.