మానసిక ఆరోగ్య వార్డు ను సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి గారు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కర్నూలు లోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నందు గల మానసిక ఆరోగ్య వార్డు ను సందర్శించారు. అక్కడ ఉన్న మానసిక వికలాంగులకు ఆపిల్ పండ్లను పంచిపెట్టారు. తదనంతరం అక్కడ ఉన్న మానసిక వికలాంగులను చూసుకునే తల్లితండ్రులకు, ఇతర పరిచారకులకు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల ఆరోగ్య సంరక్షణ హక్కు, ఆస్తి హక్కు మొదలైనవాటితో సహా మానసిక రోగుల హక్కులు మరియు మానసిక రోగులను రక్షించడం మరియు వైద్య చికిత్స అందించడం వంటి విధుల గురించి తెలియజేసారు. అంతేకాక మానసిక వికలాంగులకు కూడా సమాజంలో మిగతా వారి లాగానే జీవించే హక్కు కలదని పేర్కొన్నారు. మానసిక వికలాంగుల హక్కులకు భంగం కలిగితే వారిపై కఠిన చర్యలు కలవని తెలిపారు. మానసిక ఆరోగ్యం బాగా లేని వారికి వైద్య చికిత్సలు నిర్వహిస్తే ఆరోగ్యవంతులుగా ఉంటారని తెలిపారు. మీకు ఏవిధమైన న్యాయ సహాయం కావాలంటే కర్నూలు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ను సంప్రధిస్తే ఉచిత న్యాయ సహాయంను అందిస్తామన్నారు. NALSA (మానసిక రోగులు మరియు వికలాంగులకు చట్టపరమైన సేవలు) పథకం, 2015 గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంభందిత వైద్య అధికారులు, మానసిక వికలాంగుల తల్లితండ్రులు, ఇతర పరిచారకులు తదితరులు పాల్గొన్నారు.