PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ మాల మలేశ్వర స్వామి బన్ని ఉత్సవాల ఏర్పాట్ల పై సమావేశం

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆదోని:     హోళగుంద మండలం దేవర గట్టు ప్రాంగణంలో ఈ నెల 12 తేదీన జరిగే శ్రీ మాల మలేశ్వర స్వామి బన్ని ఉత్సవాల ఏర్పాట్లు పై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్.అంతకుముందు ఆదోని సబ్ కలెక్టర్, పత్తికొండ ఆర్డీవో, డి ఎస్ పి మరియు సంబంధిత అధికారులతో కలసి పార్కింగ్, సి.సి. ఫుటేజ్ , బారి కెడ్లు, శానిటేషన్, మరియు లైటింగ్ ఏర్పాటు చేయవలసిన స్థల ప్రాంతాలను పరిశీలించారు.అనంతరం అరికెర గ్రామంలో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పత్తికొండ ఆర్డీవో భరత్ నాయక్ డి ఎస్ పి వెంకట రామయ్య   కలసి గ్రామ ప్రజలకు ప్రశాంత వాతావరణంలో పండుగా జరుపుకునే విధంగా అవగాహన కల్పించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *