PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ కు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుంది

1 min read

కాంగ్రెస్ నాయకులు ఎన్ సి బజారన్న

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూల్ నగరంలో ప్రజా పరిరక్షణ సమితి మరియు నాలుగో తరగతి ఉద్యోగ ఇంటి స్థల బాధితులు సంయుక్తంగా  ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి  దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు హాజరు కావడం జరిగినది.ఈ కార్యక్రమం ARK డేవిడ్ గారి అధ్యక్షతన ప్రజా ప్రతిక్షణ సమితి నాయకులు నిర్వహించడం జరిగినది. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు ఎన్సి బజారన్న, కర్నూల్ సిటీ ముస్లిం మైనార్టీ సెల్ చైర్మన్ షేక్ ఖాజా హుస్సేన్ అన్ని రాజకీయ పార్టీల నాయకులు  ప్రజాసంఘాల నాయకులు అలాగే నాలుగో తరగతి ఇంటి స్థల బాధితులు కూడా పాల్గొనడం జరిగింది. బజారన్న మాట్లాడుతూనాలుగో తరగతి ఉద్యోగుల కోరికైన వారి ఇంటి స్థలాలను వారికి  కేటాయించి అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దుపరిచి ఈ అక్రమాలకు పాల్పడిన   వారిని పైన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కర్నూల్ టౌన్ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ కో ఆపరేటివ్ సొసైటీ ద్వారా 1987 వ సంవత్సరంలో సొసైటీ ద్వారా ప్లాట్లను తీసుకున్నారని అందులో కొంతమంది సొసైటీ నాయకులుగా ఏర్పడి ఒరిజినల్ మెంబర్స్ కు అన్యాయం చేస్తూ అందులో ఉన్నటువంటి ప్లాట్లను వాళ్ల స్వప్రయోజనాల కోసం వాళ్ల లబ్ది కోసం  ఇతరులకు అమ్ముకొని తోటి ఫోర్త్ క్లాస్  ఎంప్లాయిస్కు అన్యాయం చేయడం జరిగిందని అప్పటినుండి 40 సంవత్సరాలుగా మిగిలిన బాధితులు పోరాటాలు చూస్తూ చట్ట ప్రకారంగా కోర్టులను అధికారులను ఆశ్రయించి వారికి విన్నవించుకోవడం జరిగిందని, కోర్టు కూడా అన్యాయం జరిగిన వారికి న్యాయం జరపండి అని తీర్పు ఇచ్చిందని కానీ ఇక్కడ ఉన్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెక్కినట్టుగా వ్యవహరిస్తున్నారని ఇప్పుడు ఈ అన్యాయానికి గురైన వారికి న్యాయం చేయుటకు ఈ ప్రజా పరిరక్షణ ఆధ్వర్యంలో  అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘ నాయకులు కూడా పాల్గొనడం జరిగిందని ఈ కార్యక్రమంలో అన్యాయం జరిగిన వారికి పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ షర్మిల రెడ్డి ఆదేశాల ప్రకారం కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పి మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో  ఏ కార్యక్రమం జరిగిన కాంగ్రెస్ పార్టీ వెన్నంటి ఉంటూ వారికి న్యాయం జరిగేంత వరకు వారి పోరాటంలో పాలు పంచుకుంటామని బజారన్నగారు హామీ ఇచ్చారు. అనంతరం ఖాజా హుస్సేన్ మాట్లాడుతూ1980 ఆనాటి గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీ గారు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ కొరకు ఇచ్చిన స్థలాలు  కబ్జాలకు గురి అయిన కారణంగా సమస్యలు పరిష్కరించడానికి  ప్రజా సంరక్షణ సమితి ఏర్పడిందని ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ మన దేశానికి వెన్నెముక లాంటివారని కానీ వారికి ఎలాంటి అన్యాయం జరిగిన కాంగ్రెస్ పార్టీ ముందుండి  పనిచేయుటకు మా జిల్లా అధ్యక్షులు పి మురళి కృష్ణ ఆదేశాల మేరకు ఎలాంటి కార్యక్రమాలు చేయడం కోసం సిద్ధంగా ఉన్నామని ఖాజా హుస్సేన్ తెలియజేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *