ఏపీఎస్ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఆయుధ పూజ
1 min readపల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : పట్టణంలో ఏపీఎస్ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఆయుధపూజ నిర్వహించారు. ఆయుధ పూజ అనేది వ్యవసాయ ఉపకరణాలు యంత్రాలు వాహనాలు కంప్యూటర్లు వంటి ప్రజల జీవితంలో అంతర్భాగమైన పరికరాలు సాధనలను పూజించటానికి అంకితం చేయబడిన రోజు ఈ రోజున ప్రజలు తమ పనిముట్లను శుభ్రం చేసి అలంకరిస్తారు వారి శ్రేయస్సు వారి పనిలో విజయం కోసం దైవిక ఆశీర్వాదాలు కోరుతూ వాటికి పూజ చేస్తారు ఈరోజు అమ్మవారు మహిషాసురుడిని అంతం చేసి మహిషాసుర మర్దిని గా నామాన్ని స్థిరం చేసుకుంది. దుష్ట శిక్షణ శిక్ష రక్షణ చేసి శాంతి స్వరూపిణి ఆ అమ్మవారిని ఎమ్మిగనూరు ఏపీఎస్ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న ఉద్యోగులంతా పూజలు చేసి అమ్మవారిని కొలిచారు. తమ డిపోలో ఎటువంటి దుష్టశక్తి రాకుండా ఉండుటకు ఎమ్మిగనూరు డిపో బస్సులు ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించాలని డిపో అభివృద్ధి చెంది లాభాల బాటలో రావాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గంగన్న, మహేశ్వర్ రెడ్డి, కే.కే., ప్రసాద్, శరణప్ప, ఎం ఎల్ రెడ్డి, సురేష్ బాబు, బజార్ అప్ప, నేషనల్ మద్దూర్ యూనిటీ అసోసియేషన్ కార్యదర్శి ముస్తాక్ అహ్మద్, సహాయ కార్యదర్శి మదార్ సబ్, ముస్లిం మైనారిటీ అసోసియేషన్ సహాయ కార్యదర్శి పీఎం భాషా, షఫీ ఉల్లా, ఎలక్ట్రిషన్ ఉస్మాన్, శారద, మరియు భారతమ్మ పాల్గొన్నారు.