ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు జిల్లా స్థాయి లోనే జరపండి: ఆఫ్టా
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఈ దసరా సెలవలు ముగిసిన తరువాత మన రాష్ట్రం లో ప్రాథమిక స్థాయిలో బోధిస్తున్న ఉపాధ్యాయులకు విద్యాబోధన లో మెలుకువలు పెంపొందించే ఫౌండేషనల్ లిటరసీ మరియు న్యూమరసీ (FNL) వృత్యంతర శిక్షణా తరగతులను రెండు లేదా మూడు జిల్లాలకు కలిపి ఒక చోట సుమారు 6 రోజుల పాటు రెసిడెన్షియల్ తరగతులు నిర్వహించుటకు ప్రభుత్వం వారు షెడ్యూల్ ఇచ్చి యున్నారు. దీని వల్ల చాలామంది మహిళా ఉపాధ్యాయిని లకు మరియు 55 సంవత్సరాలు దాటిన ఉపాధ్యాయులకు (ఆరోగ్య సమస్యలు) ఎంతో ఇబ్బంది మరియు వ్యయ ప్రయాసలు ఎదుర్కో వలసి ఉంటుంది . కావున చాలా మంది మహిళా ఉపాధ్యాయిని లను మరియు సీనియర్ ఉపాధ్యాయులను దృష్టిలో ఉంచుకొని ఈ FLN శిక్షణా తరగతులను అన్ని జిల్లా ల జిల్లా కేంద్రాలలో లేదా డివిజన్ స్థాయిలో నిర్వహించాలని ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ పక్షాన సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ గారిని వ్రాత పూర్వకంగా లేఖ ద్వారా ప్రాతినిథ్యం చేయటం జరిగింది.కావున వారు ఈ విషయం లో తగు చర్యలు తీసుకోవాలి.ఎ జి ఎస్ గణపతి రావు రాష్ట్ర అధ్యక్షుడుకాకి ప్రకాష్ రావు రాష్ర్ట ప్రధాన కార్యదర్శి.