అభివృద్ధే ఎజెండా..మంత్రి లోకేష్ దృష్టికి
1 min readత్రాగునీటి,ఎత్తిపోతల పథకం..అలగనూరు రిజర్వాయర్ మరమ్మతులకు నిధులు
వివిధ పనులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే వినతి..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు నియోజకవర్గ అభివృద్దే ఎజెండాగా ముందుకు వెళ్తున్నారు నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య..నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు గాను అంతే కాకుండా ముఖ్యంగా నందికొట్కూరు పట్టణానికి త్రాగునీటి సమస్యను తీర్చడానికి నిధులు మంజూరు చేయాలని మిడుతూరు మండలానికి ఎత్తిపోతల పథకం..98 జీవో ఉద్యోగాలు ఇచ్చుట బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలని అంతేకాకుండా నియోజకవర్గంలోని మల్యాల అలగనూరు రిజర్వాయర్ మరమ్మతులకు నిధులు మంజూరు చేయుట మరియు సంగమేశ్వరం,కొలనుభారతి దేవాలయాలను శ్రీశైలం దేవస్థానానికి కలుపుట గురించి మంత్రితో చర్చించినట్లు ఎమ్మెల్యే జయసూర్య తెలిపారు.అభివృద్ధి పనుల గురించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను విజయవాడలోని ఆయన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం మంత్రిని ఎమ్మెల్యే కలిసి అభివృద్ధి పనుల గురించి మంత్రితో ఎమ్మెల్యే చర్చించారు. నియోజవర్గంలోని ఆరుమండలాల్లో మరియు నందికొట్కూరు పట్టణాన్ని అభివృద్ధి చేసే విధంగా మంత్రితో చర్చించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా మంత్రిని కలిసిన వారిలో పగిడ్యాల మండల కన్వీనర్ పలుచాని మహేశ్వర్ రెడ్డి,చెరుకుచెర్ల గుండం హరి సర్వోత్తమ్ రెడ్డి ఉన్నారు.