విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలి
1 min readవార్డు సభ్యులు బి. సురేంద్ర కుమార్ డిమాండ్
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: రెవిన్యూ డివిజనల్ కేంద్రమైన పత్తికొండ పట్టణంలో కర్నూలు రోడ్డు లోని రాజీవ్ నగర్ లో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని పత్తికొండ మేజర్ గ్రామ పంచాయతీ ఒకటవ వార్డు (సీపీఐ) సభ్యులు బి. సురేంద్ర కుమార్ డిమాండ్ చేశారు.శుక్రవారంనాడు ఆయన ఆ కాలనీ వాసులు తో కలసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రాజీవ్ నగర్ లో ప్రజలు విద్యుత్ స్తంభాలు లేక చాలా అవస్థలు పడుతున్నారన్నారు.విద్యుత్ స్తంభాలు లేకపోవడంతో కొంత కాలనీ అంధకారంలో ఉందని, రాత్రి సమయాలలో విష సర్పాలు తిరుగుతున్నాయని , పాములకు భయపడి బిక్కుబిక్కుమంటూ ఆ కాలనీ వాసులు బ్రతుకు తున్నారని పేర్కొన్నారు. విద్యుత్ స్తంభాలు కావాలని వార్డు సభ్యులు డిమాండ్ మేరకు గతంలో రెగ్యులర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి వున్నప్పుడు ,గ్రామ పంచాయతీ సమావేశంలో తీర్మానం చేసారని తెలిపారు. ఆయన బదిలీపై వెళ్లి కూడా ఒకటిన్నర సంవత్సరం అవుతుందని అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ సమావేశంలో, సమావేశం దృష్టికి తీసుకెళ్లిన ఇంచార్జి గ్రామ కార్యదర్శి ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. రాజీవ్ నగర్ లో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని స్థానిక విద్యుత్ అధికారుల కు కూడా సీపీఐ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించామని అయిన ఎలాంటి స్పందన లేదని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా గ్రామ పంచాయతీ, విద్యుత్ అధికారులు స్పందించి తక్షణమే ఆ కాలనిలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో మోహన్, ఆ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.