‘జెమ్కేర్ కామినేని ’ లో వరల్డ్ ఆర్థరైటిస్ డే పై అవగాహన సదస్సు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ నగరంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా జెమ్కేర్ కామినేని హాస్పిటల్ లో వరల్డ్ ఆర్థరైటిస్ డే పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవి బాబు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 12న వరల్డ్ ఆర్థరైటిస్ డే గా జరుపుకుంటారని తెలిపారు. ఆర్థరైటిస్లో 100 రకాల జబ్బులు ఉన్నాయని తెలిపారు.అందులో ఒస్టియోఆర్థరైటిస్, రూమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి రోగాలు ఉన్నాయి. సర్వే Report ఆదారంగా ఈ వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా 350 మిలియన్ల వ్యక్తులను ప్రభావితం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఆర్థరైటిస్ యొక్క లక్షణాలు, సంకేతాల గురించి అవగాహన పెంచుకోవడం,వ్యాధి నిర్వహణ గురించి ప్రోత్సహించడం, మెరుగైన చికిత్స కూడా కోసం సరైన హాస్పిటల్ ని ఎంచుకోవడం కూడా కీలకమని చెప్పారు. ఈ సదస్సు లో జెమ్కేర్ కామినేని హాస్పిటల్స్ ఎండి డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ తమ హాస్పటల్లో ఇప్పటివరకు 605 ఆర్తో కేసెస్,428 పిఆర్పిఎస్, 168 ట్రౌమా, 180 షోల్డర్ ఆర్తోస్కోపీ, 172 నీ ఆర్తోస్కోపి 70 టీ కే ఆర్ 15 టి హెచ్ ఆర్ కేసెస్ ని విజయవంతంగా చేశామని చెప్పారు. కార్యక్రమంలో జెమ్కేర్ కామినేని హాస్పిటల్స్ ఎండి సీఈఓ చంద్రశేఖర్, డాక్టర్ రాఘవేంద్ర ఎండి కార్డియాలజిస్ట్,డాక్టర్ రామ్మోహన్ రెడ్డి హెచ్.ఓ.డి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, డాక్టర్ మాధవి అనస్తేషియా, డాక్టర్ గణేష్ సి.ఓ.ఓ , నదీమ్ జనరల్ మేనేజర్, డాక్టర్ కీన్ కౌల్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మరియు హాస్పటల్ సిబ్బంది పాల్గొన్నారు.