PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దేవరగట్టు బన్ని ఉత్సవం భద్రత ను పర్యవేక్షించిన… జిల్లా ఎస్పీ.. కలెక్టర్​

1 min read

ప్రశాంతంగా ముగిసిన బన్ని ఉత్సవం… బన్ని ఉత్సవం  ఇది ఒక సంబరం..

బన్ని ఉత్సవం లో పోలీసులకు సహాకరించిన ఇతర శాఖలకు,  మీడియా వారికి ప్రత్యేక అభినందనలు తెల్పిన … జిల్లా ఎస్పీ.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా,  హోళగుంద మండలం , దేవరగట్టులో ఆదివారం దసరా పండుగ సంధర్బంగా బన్ని ఉత్సవాన్ని సంప్రదాయంగా కొనసాగించారు.కట్టుదిట్టమైన భద్రత మధ్య బన్ని ఉత్సవం ముగిసింది.ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్  గారు  మీడియాతో మాట్లాడారు. అక్టోబర్ 12 న దసర పండుగ సంధర్బంగా  దేవరగట్టులో జరిగే బన్ని ఉత్సవం  ప్రశాంతంగా ముగిసిందన్నారు.కళ్యాణం, భవిష్యవాణి, బన్ని ఉత్సవం ప్రశాంతంగా జరిగాయన్నారు. ప్రతి ఏటా కన్న ఈ ఏటా వర్షాలు బాగా పడడం వలన పంటలు బాగా పండి ప్రజలు 2 లక్షల కు పైగా  బన్ని ఉత్సవం కు వచ్చారన్నారు. ఎక్కడా కూడా ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగలేదన్నారు. చిన్న చిన్న చెదురు , ముదురు ఘటనలు చోటు చేసుకున్నాయన్నారు.  చిన్న చిన్న గాయాలైనా వారికి ఆదోని సబ్ కలెక్టర్ సహాకారంతో మెరుగైన వైద్యం  అందించామన్నారు. 2 లక్షల మంది పై గా పాల్గొన్న ఈ బన్ని ఉత్సవంలో మొత్తం 60 మంది దాకా  గాయాలు కావడం జరిగిందన్నారు.  ( మొత్తం 60 మందిలో …  బన్ని ఉత్సవం సంధర్బంగా 30 మందికి ,  గుడి దగ్గర కొండ పైకి మెట్లు ఎక్కడం, దిగడం తోపులాట లో మరియు దూర ప్రయాణంలో చిన్న చిన్న ప్రమాదాలు ఇంకొ 30 మందికి గాయాలు కావడం జరిగిందన్నారు)  .   ఎవరికి కూడా ఎటువంటి ప్రాణ పాయం లేదన్నారు. ఉత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించడంలో అన్ని శాఖలు సమన్వయంతో పని చేశాయన్నారు. బందోబస్తు విధులలో కర్నూలు జిల్లా పోలీసులతో పాటు , ఇతర జిల్లాల నుండి వచ్చిన పోలీసు సిబ్బంది అందరూ కూడా బాగా విధులు నిర్వర్తించినందుకు అభినందిస్తున్నామన్నారు. ఈ బన్ని ఉత్సవం విజయవంతం కావడానికి మీడియా వారి  సహాకారం కూడా ఉందన్నారు.  5 డ్రోన్ల తో నిఘా ఉంచామన్నారు. ఎక్కడ కూడా హింసాత్మక ఘటనలు జరగలేదన్నారు. ఒక సంబరం లాగా జరిగిందన్నారు.జిల్లా ఎస్పీ తో పాటు జిల్లా టిడిపి పార్టీ ఇంచార్జ్ తిక్కారెడ్డి,  ఆలూరు నియోజక వర్గ ఇంచార్జ్ వీరభద్రగౌడ్,   పత్తికొండ ఆర్డిఓ భరత్ నాయక్ , డిస్పీలు వెంకట్రామయ్య, శ్రీనివాసాచారి, ఉపేంద్రబాబు , డివిజనల్ పంచాయితి అధికారి నూర్జహాన్, ట్రైనీ డిఎస్పీ ఉష శ్రీ,  సిఐలు,  పోలీసు సిబ్బంది ఉన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *