PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పకృతి వ్యవసాయాన్ని పరిశీలించిన వ్యవసాయ అధికారులు 

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : చెన్నూరు   మండలం కనపర్తి గ్రామానికి చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు దండు బోయిన బా లచంద్ర బలసింగన పల్లి గ్రామంలో పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్దతి & ఆధ్యాత్మిక పద్దతిలో సాగుచేస్తున్న పసుపు పంటను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది.ఆదివారంఉదయం, సాయంత్రం అగ్నిహోత్రం తోపాటు ద్రవ జీవామృతం, పండ్లరసం ద్రావణం, బ్యాక్టీరియా కల్చర్, అనుజలం, పంచగవ్య,కవచ్, ఫసల్ ఘుట్టి, ఆవాల పిండి మరియు సైంధవ లవణము,సున్నం వంటి పదార్థాలు వాడటన్ని గమనించారు.జీరో గ్రాఫ్ తో విత్తన శుద్ది చేయడం జరిగింది.ఈ వినూత్న వ్యవసాయ పద్ధతుల తో ఖర్చు తక్కువ నాణ్యమైన దిగుబడులు వస్తాయని సదరు రైతు తెలిపారు. ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ శ్రీ ఎస్.ప్రవీణ్ కుమార్, బద్వేల్ వ్యవసాయ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఎం నాగరాజ పాల్గొన్నారు.

About Author