తప్పిపోయిన ఇద్దరు పిల్లలను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
1 min read3 గంటల్లోనే చేధన.
కర్నూలు త్రీ టౌన్ పోలీసులను, ఆటో డ్రైవర్ల ను అభినందించిన … జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్
చిన్న పిల్లలు తప్పిపోకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి … జిల్లా ఎస్పీ.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు మూడవ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని మారుతి మెగాసిటి శ్రీ నిధి అపార్ట్ మెంట్ నుండి ఈ రోజు ఇద్దరు పిల్లలు రూ. 10 నోటు తీసుకొని జామకాయలు కొనుక్కోవడానికి ఉదయం 7.30 గంటలకు ఇంటి నుండి బయటకు వచ్చి కనిపించకుండా పోయారు.
తప్పిపోయిన పిల్లల వివరాలు:
1) ఎమ్. అభినవ్ రెడ్డి ( 6 yrs) 2) సి. హరిచరణ్ ( 5 yrs)
తండ్రి ఉద్యోగ రీత్యా బయటకు వెళ్ళి పోయాడు. తల్లి గృహిణి ఇంటిలో ఉన్నది. ఎంతసేపటికి పిల్లలు ఇంటి కి రాలేదని గమనించి కర్నూలు మూడవ పట్టణ పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేశారు. కర్నూలు డిఎస్పీ జె. బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో కర్నూలు త్రీ టౌన్ సిఐ మురళీ ధర్ రెడ్డి, కర్నూలు త్రీ టౌన్ ఎస్సై మన్మథ విజయ్ మరియు పోలీసు బృందాలుగా ఏర్పడి ఆ పిల్లల కు సంబందించిన సమాచారాన్ని పోలీసు వాట్సాప్ గ్రూపులలో మరియు ఆటోడ్రైవర్ల కు సమాచారాన్ని చేరవేశారు. కర్నూలు త్రీ టౌన్ పరిధిలో ఉండే సి. క్యాంపు ఎంప్లాయిస్ కాలనీ మహిళలు ఈ పిల్లలను గుర్తుబట్టారు. ఆ పిల్లలు చదివే మాంటి స్సోరి స్కూల్ ఆటో డ్రైవర్లకు (ఉపేంద్ర నాయక్ – ఆరోరా నగర్, యు. బుజ్జి – మాంటిస్సోరి స్కూల్ , బాలరాజు – మాంటిస్సోరి స్కూల్ ) సమాచారాన్ని అందించారు. కర్నూలు త్రీ టౌన్ పోలీసులు , ఆటో డ్రైవర్ల సహాయంతో కర్నూలు ఆరోరా నగర్ , జమ్మిచెట్టు దగ్గర ఇద్దరు పిల్లలను గుర్తించారు. వారి తల్లిదండ్రులకు ఉదయం 11 గంటలకు కౌన్సిలింగ్ చేసి పిల్లలను అప్పగించారు.వెంటనే స్పందించిన కర్నూలు త్రీ టౌన్ పోలీసులను, ఆటో డ్రైవర్లను జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్ ప్రత్యేకంగా అభినందించారు. ఆటో డ్రైవర్లను కర్నూలు త్రీ టౌన్ పోలీసు స్టేషన్ లో కర్నూలు త్రీ టౌన్ పోలీసులు శాలువతో సన్మానించి అభినందించారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్ తెలిపారు. తల్లి దండ్రులు మాటలు వచ్చే చిన్న పిల్లలకు వారి మొబైల్ నంబర్లు, ఇంటి అడ్రస్, తల్లి దండ్రుల పేర్లు తెలిసే విధంగా తర్ఫీదు, అవగాహన చేయాలన్నారు. చిన్న పిల్లలు తప్పి పోకుండా తల్లిదండ్రులకు సంబందించిన సమాచారాన్ని , మొబైల్ వివరాలు, అడ్రస్ గాని వారి జేబులలో ఉంచాలని, తల్లి దండ్రులు చిన్నపిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్ తెలిపారు.