PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మద్యం షాపుల కేటాయింపుకు లాటరీ ప్రక్రియ పూర్తి

1 min read

పారదర్శకంగా సజావుగా మద్యం షాపుల కేటాయింపు కొరకే లాటరీ ప్రక్రియ

జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు జిల్లాలో   మద్యం షాపులకు సంబంధించిన లాటరీ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య పర్యవేక్షణలో మద్యం షాపుల అనుమతుల కొరకు లాటరీ పద్ధతితో  కేటాయించే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పాల్గొని టోకెన్ తీసి షాపుల కేటాయింపును ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈరోజు ఉదయం 8 గంటల నుండి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మద్యం షాపులకు సంబంధించిన లాటరీ ప్రక్రియ ను ప్రారంభించామన్నారు.జిల్లాలోని 99 షాపుల కోసం 3046 దరఖాస్తులు వచ్చాయని వీటిని ఆయా స్టేషన్ల పరిధిలోని మద్యం షాపుల వారిగా వచ్చిన దరఖాస్తులను నూతన మద్యం పాలసీ ప్రకారం లాటరీ పద్ధతిలో మద్యం షాపుల  కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపికను నిర్వహించడం జరిగిందన్నారు. దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బంది కలగాకుండా పద్ధతి ప్రకారం పారదర్శకంగా లాటరీ ప్రక్రియ నిర్వహించి, ఆయా ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలోనికర్నూలు31,కోడుమూరు14, ఎమ్మిగనూరు15,ఆదోని 12, కోసిగి 04,ఆలూరు 09, పత్తికొండ 14, మొత్తం 99 షాపులకు లాటరీ పద్ధతిలో కేటాయించడం జరిగిందని కలెక్టర్ వివరించారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, ఇంచార్జ్ డిఆర్ఓ చిరంజీవి, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, కర్నూలు ఆర్డిఓ సందీప్ కుమార్, డిప్యూటీ కమిషనర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శ్రీదేవి, పర్యవేక్షణ అధికారి సుధీర్ బాబు, ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author