పల్లె పండుగ కార్యక్రమంలో గ్రామాలకు మహర్దశ….
1 min readగ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం
ఎమ్మెల్యే పుత్తాకృష్ణ చైతన్య రెడ్డి
80 లక్షల రూపాయలతో సీసీ రోడ్లకు ఎమ్మెల్యే భూమి పూజ
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళుతుందని కమలాపురం శాసనసభ్యులు పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండలంలోని రామనపల్లి గ్రామపంచాయతీలోని మోడాల వద్ద చిన్నమాచుపల్లి మెయిన్ రోడ్డు నుండి, రామనపల్లె వరకు 80 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాలలోని ప్రజల మౌలిక వసతుల కోసం ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు, అందులో భాగంగానే చిన మ్యాచుపల్లి వద్ద నుండి, రామనపల్లి వరకు 80లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో లాగా కాకుండా ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యను గుర్తించిన వెంటనే ఆ సమస్యకు పరిష్కారం చూపడం జరుగుతుందని తెలిపారు. చిన్నమాచు పల్లె హైవే నుండి రామనపల్లె కు పోయే రహదారి గుంతలమయమై, అటు బాటసారులు, ఇటు వాహనదారులు వెళ్లేందుకు చాలా ఇబ్బందులకు గురైయ్యేవారని తెలిపారు. ఈ రోడ్డు చూసిన వెంటనే 80 లక్షల రూపాయల కేటాయించి వెంటనే పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం, అభివృద్ధి సంక్షేమం రెండు కల్లుగా పనిచేస్తుందని, ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముందుంటుందని ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చెన్నూరు క్లస్టర్ ఇంచార్జ్ తాడిగొట్ల వెంకటసుబ్బారెడ్డి (బుజ్జన్న) మాజీ అటవీ శాఖ డైరెక్టర్ రామన శ్రీలక్ష్మి,రామన చంద్రమోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ పుత్తా వేణుగోపాల్ రెడ్డి, జిల్లా పార్లమెంటరీ అధికార ప్రతినిధి మన్నూర్ అక్బర్, బీసీ సెల్ జిల్లా అధికార ప్రతినిధి వేల్పుల సుబ్రహ్మణ్యం, టిడిపి సీనియర్ నాయకులు ముండ్ల నరసింహారెడ్డి, ఐ టి డి పి మణికంఠ, రాజారెడ్డి, బి. మురళి, రమేష్, కత్తి లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.