కడుమూర్ లో సీసీ రోడ్లకు భూమి పూజ..
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కడుమూరు గ్రామంలో సోమవారం ఉదయం 10:30 కు ‘పల్లె పండుగ..పంచాయితీ వారోత్సవాలు’కార్యక్రమంలో భాగంగా సిమెంట్ రహదారులకు అధికారులు భూమి పూజ చేశారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో 10 లక్షలు మరియు మైనార్టీ కాలనీలో 15 లక్షల ఉపాధి హామీ పథకం నిధులతో మంజూరు అయిన 2 సిమెంట్ రోడ్లకు మిడుతూరు ఎంపీడీఓ పి దశరథ రామయ్య, మరియు గ్రామ నాయకులు టెంకాయలు కొట్టి భూమి పూజ చేశారు.గత ఆగస్టు నెల 23వ తేదీన గ్రామసభలో ఈ రోడ్లకు తీర్మానం చేయడం జరిగింది ఈ పనులకు ప్రభుత్వం నుండి నిధులు మంజూరు కావడంతో ఈ రోడ్లకు నిన్న భూమి పూజ చేశారు.ఈ కార్యక్రమంలో ఈవోఆర్డీ సంజన్న,పిఆర్ ఏఈ ప్రతాప్ రెడ్డి,ఏపీఓ జయంతి, గ్రామ నాయకులు సుధాకర్ రెడ్డి,సల్కోటి గోవర్ధన్ రెడ్డి,ఇద్రిస్,మగ్బుల్ అహ్మద్,ఐసీడీఎస్ సూపర్వైజర్ వరలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి శివ కళ్యాణ్ సింగ్,ఈఏ రమేష్ తదితరులు పాల్గొన్నారు.