సీఎంఆర్ ఫస్ట్ ఫ్లోర్ లో మినీ షో రూమ్ ప్రారంభించిన ఎమ్మెల్యే
1 min readఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏకైక షోరూం
అందరికీ అందుబాటు ధరల లో లభ్యం
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు నగరంలో సిఎంఆర్ సెంట్రల్ మాల్ కాంప్లెక్స్ నందు శనివారం మినీ సో షో రూమ్ ను ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఈ షో రూమ్ లో జపాన్ బ్రాండెడ్ ఐటమ్స్ అన్ని దొరుకుతాయని ప్రజలంతా షోరూం సందర్శించి అందరికీ కావలసిన ఐటమ్స్ సద్వినియోగం చేసుకోవాలన్నారు. షాపు యజమాని గిరిధర్ మాట్లాడుతూ వరల్డ్ వైడ్ గా 7,000 షో రూమ్ లు ఉన్నాయని భారత దేశంలో 200 షోరూములు ఉన్నాయన్నారు. ఏలూరు లో మొట్టమొదటిసారిగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బ్రాండ్ల యొక్క ఐటమ్స్ అన్ని రకాలు దొరుకుతాయని తెలిపారు.60 రూపాయల నుండి అధిక ధరల వరకు మీరు కోరే మెచ్చే ఐటమ్స్ ఈ ఈ సెంట్రల్ ఏసి సిఎంఆర్ మల్టీప్లెక్స్ మా మినీ షో నందు లభిస్తాయి అన్నారు. ప్రతి ఒక్కరూ సందర్శించి ఒక్కసారి మా క్వాలిటీ, క్వాంటిటీ గమనించాలని గిరిధర్ తెలియజేశారు. కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ ఇంచార్జి రెడ్డి అప్పలనాయుడు, అంబికా రాజా, జనసేన నాయకులు నారా శేషు మరియు పలు ప్రముఖ వ్యాపారవేత్తలు, పలువురు నాయకులు పాల్గొన్నారు.