ఈ నెల 17న జరుగనున్న వాల్మీకి జయంతి రాష్ట్ర పండుగను జయప్రదం చేయండి
1 min readటిడిపి జిల్లా అధ్యక్షులు పి. తిక్కారెడ్డి పిలుపు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఈ నెల అనగా తేది 17-10-2024న గురువారం ఉదయం 10 గంటలకు కర్నూలు జిల్లా కలెక్టరేట్ సునయన ఆడిటోరియం నందు మహర్షి శ్రీశ్రీశ్రీ వాల్మీకి జయంతి కార్యక్రమాన్ని పూర్తిగా అధికారికంగా నిర్వహించడం జరుగుతుందనీ, ఈ జయంతి వేడుకలకు జిల్లా మంత్రివర్యులుశ్రీ టి.జి. భరత్తో పాటు, శాసనసభ్యులు, మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ముఖ్యనేతలు హాజరు కానున్నారనీ, జిల్లాలోని అన్ని వర్గాల ప్రజానీకం విరివిగా హాజరై వాల్మీకి జయంతి వేడుకలను జయప్రదం చేయవలసినదిగా కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, రాష్ట్ర టిడిపి ప్రధానకార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, బి.సి. సెల్ పార్లమెంట్ అధ్యక్షులు సత్రం రామక్రిష్ణుడు లు విజ్ఞప్తిచేశారు. ఈ రోజు వారు జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయం నందు పత్రికా, మీడియా ప్రతినిధులతో ఈ విషయాన్ని తెలియపర్చారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీరాముని గురించి ఈ రోజు ప్రజలు తెలుసుకొ గలుగుతున్నారంటే వాల్మీకి మహర్షిగారే కారణమని అనాడు వారు రామాయణాన్ని రచించి దేశానికి ఒక ఆదర్శమూర్తి చరిత్రను తెలుసుకునే అవకాశాన్ని కలుగజేసిన మహానీయులు మహర్షి వాల్మీకినీ అలాంటి మహానీయుని జన్మదిన వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం తరుపున నిర్వహించేందుకు నిర్ణయించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు కి, ఉపముఖ్యమంత్రి … శ్రీ సవన్ కళ్యాణ్ కి ఈ సందర్భంగా ప్రత్యేక దన్యవాదములు తెలియజేశారు. వల్లెపండుగ : రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్వరాజ్యాన్ని కాపాడుతూ ఈ రోజు గ్రామీణ ప్రాంతాలకు కావలసినటువంటివసతుల కల్పనకు రూ.4500 కోట్లు కేటాయించిందనీ, దీని ద్వారా సి.సి.రోడ్లు, గోరులాలు, డ్రైనేజీ, మరియు వీధిదీపాలు వంటి వసతులను కల్పించేందుకు మార్గం సుగమమైందనీ, ఈ వారం రోజులలో చేపట్టిన పనులను సంక్రాంతలోగా పూర్తిచేసి ప్రారంబోత్వవాలు చేయడం జరుగుతుందనీ వివరించారు. జగన్ హయాంలో గ్రామపంచాయితీల నిధులను స్వాహాచేస్తే ప్రస్తుత ప్రభుత్వం వాటికి నిదులిచ్చి గ్రామాభివృద్ధికి కృషిచేస్తున్నదనీ వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రామాంజనేయులు, యస్. షేక్షావలి, పాల్గొన్నారు.