ఎమ్మెల్యే గ్రీవెన్స్ కు..అనూహ్య ‘స్పందన’
1 min readఅధికంగా రెవెన్యూ సమస్యలే -వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే జయసూర్య..
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): మిడుతూరు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ గ్రీవెన్స్ అనే కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాల ప్రజల నుండి అనుహ్య స్పందన లభించింది.నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య మ12:30 కు ప్రారంభించగా స్వయంగా ఎమ్మెల్యే ప్రజల నుండి వినతులను స్వీకరించారు. మొత్తం 67 వినతులు రాగా వీటిలో 33 రెవెన్యూ సమస్యలే అధికంగా ఉన్నాయి.మీరు ఏ సమస్యతో వచ్చారు ఎందుకు వచ్చారు అని ఎమ్మెల్యే ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలను వింటూ సమస్యలు పరిష్కరించే విధంగా ఉంటే వెంటనే వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారికి రెఫర్ చేశారు. మిడుతూరు నుండి దేవనూరు,చౌటుకూరు మీదుగా ఓర్వకల్లు రోడ్డు అద్వానంగా ఉందని రోడ్డు వేయాలని అదేవిధంగా పైపాలెం-కడుమూరు రోడ్డు మరియు వివిధ గ్రామాలకు రోడ్లు వేయాలని 9 వినతులు వచ్చాయి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పొలాలకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉన్నాయని ఈ సమస్యలు రక రకాలుగా ఉన్నాయి.పొలంలో అనుభవంలో ఉన్నవారికి అసైన్మెంట్ కమిటీ త్వరలో వస్తుందని వాటి ద్వారా వాటిని పరిష్కరిస్తామన్నారు. అంతేకాకుండా మీ గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా సీసీ రోడ్లు, పొలాలకు రస్తా,గ్రామాలకు రోడ్లు తదితర అభివృద్ధి పనులు ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి సుధారాణి,ఎంపీడీవో దశరథ రామయ్య,తహసిల్దార్ శ్రీనివాసులు,మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి,వంగాల శివరామిరెడ్డి,ఎంఈఓ లు ఫైజున్నిసా బేగం,శ్రీనాథ్, ఏపీవో జయంతి మరియు తదితర అధికారులు పాల్గొన్నారు.