NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అన్నా క్యాంటీన్ కు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే 

1 min read

పత్తికొండ, న్యూస్​ నేడు:  పత్తికొండ పట్టణంలో అన్నా క్యాంటీన్ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే కె శ్యామ్ కుమార్ శనివారం భూమి పూజ నిర్వహించారు.పత్తికొండ నియోజకవర్గ కేంద్రంలో 65లక్షల నిధులతో ప్రతి రోజు ఒక పూటకు 3వందల మందికి పైగా 5 రూపాయలకే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం అందించాలన్న తపనతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నారని ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్ ఈ సందర్భంగా అన్నారు. ఈ మేరకు పత్తికొండ పట్టణంలోని గ్రామ పంచాయితీ సమీపంలో అన్న క్యాంటీన్ కు ఎంఎల్ఏ కే ఈ శ్యాం కుమార్ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ, పేదవాడి ఆకలి తీర్చేందుకే అన్న క్యాంటీన్ల ఏర్పాటు అని అన్నారు. గత వైసిపి ప్రభుత్వం లో అన్న క్యాంటీన్లను నిర్వీర్యం చేసి పేదవాడి కడుపు కొట్టారని అన్నారు. ఇప్పటివరకు పట్టణాలకు, జిల్లా కేంద్రాలకు పరిమితమైన అన్న క్యాంటీన్లను మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయడం చంద్రబాబుతోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ,ఎంపీడీవో గ ,పంచాయతీ సిబ్బంది, రెవిన్యూ సిబ్బంది తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author