PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సెయింట్ తెరిసా కళాశాలలో ముగిసిన పి సి బి వర్క్ షాప్

1 min read

మైక్రో లింక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ సంయుక్త సహకారంతో వర్క్ షాప్

విద్యార్థులు పలు విభాగాలలో శిక్షణ పొందారు

ఈ నైపుణ్య ప్రయోగాలు ఉన్నత విద్యాభ్యాసంలో ఉపయోగపడతాయి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : స్థానిక సెయింట్ థెరెసా స్వయంప్రతిపత్తి కళాశాలలో అక్టోబర్ 15..16 వ తేదీల్లో ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగం వారు విజయవాడకు చెందిన మైక్రోలింక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ లిమిటెడ్ వారి సంయుక్త సహకారంతో నిర్వహించిన పిసిబి వర్క్ షాప్ ముగిసింది. 15వ తేదీన జరిగిన మూడవ సెషన్లో విద్యార్థులు కంప్యూటర్ ల్యాబ్ లో పిసిపి విజార్డ్3.1.5 నీ ఉపయోగించి విద్యుత్ సరఫరా, టెస్టర్ మరియు నైట్ లాంప్ సర్క్యూట్లను రూపొందించారు. సర్క్యూట్ అంటే విద్యుత్ సరఫరా, అయ్యా టెస్టర్ మరియు వైట్ క్లాంప్ డ్రిల్ చేసిన రంధ్రాలను తోటంకం చేయడం ద్వారా పీసీపబిలో స్థిరపరిచారు.రెండు రోజుల వర్క్ షాప్ లో విద్యార్థులు సర్క్యూట్ డిజైనింగ్ పై శిక్షణ పొందారు. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ లో ఇచ్చింగ్, మరియు సర్క్యూట్లను కనెక్ట్ చేయడం లోని నైపుణ్యాలను నేర్చుకున్నారు. ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగాధిపతి డాక్టర్ ఏ నిర్మల జ్యోత్స్న మాట్లాడుతూ ఈ శిక్షణ ద్వారా విద్యార్థులలో ఉన్న నైపుణ్యాలను వెలికి తీయడమే కాకుండా భవిష్యత్తులో స్వయంగా నూతన ఆవిష్కరణలకు అవసరమైన సర్క్యూట్ లను రూపొందించడంలో తగిన శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. దీని ద్వారా ఉన్నత విద్యాభ్యాసంలో కూడా ప్రయోగాలను వారే స్వయంగా రూపకల్పన చేసుకోగలుగుతారన్నారు. ఈ వర్క్ షాప్ వారిలో విశ్వాసాన్ని నింపిందని, భవిష్యత్తులో మరిన్ని వినూత్న ఉన్నత స్థాయి ప్రాజెక్టులను పట్టడానికి వారికి అవకాశాలను కల్పిస్తుందని తెలియజేశారు. ఆమె ఈ రెండు రోజుల వర్క్ షాప్ కు విచ్చేసిన రిసోర్స్ పర్సన్స్ డాక్టర్ సాంబశివరావు గోవిందరావులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగాధిపతి డాక్టర్ నిర్మల జోత్స్న, అధ్యాపకులు డాక్టర్ కే శ్రీలత, శ్రీమతి అనూష, శ్రీమతి సరస్వతి, శ్రీమతి దీప్తి భార్గవ, శ్రీమతి మాధురి రోజ్ లు పాల్గొన్నారు.

About Author