గ్రామీణ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట
1 min readపల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్ద పీట వేస్తుందని టిడిపి నాయకులు మాధవరం మాజీ సర్పంచ్ రఘునాథ్ రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని సూగురు, చెట్నహల్లి, సింగరాజన్నహళ్లి, పరమాన్ దొడ్డి గ్రామాల్లో పల్లె పండగ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీరి కి గ్రామాల టిడిపి నాయకులు పూలమాలలు వేసి శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. సూగురు లో ఒకటి, చెట్నహల్లి లో ఒకటి, పి తాండ లో ఒకటి, సింగరాజన్నహళ్లి లో ఒకటి చొప్పున సిసి రోడ్ల కు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గ్రామాలను రూపురేఖలను మారుస్తామని తెలిపారు. గత ప్రభుత్వం సర్పంచ్ ల నిధులు తీసుకొని సర్పంచ్ లను అవమానం చేసిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నిధులు పుష్కలంగా వస్తున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తక్కువ రోజుల్లోనే ఎక్కువ మంది ప్రజల మెప్పు పొందిన ఘనత చంద్రబాబు కే దక్కుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పుడు నుంచి సంక్షేమానికి అభివృద్ధికి పెద్ద పీట వస్తుందని తెలిపారు. ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఏర్పడిన తక్కువ రోజుల్లోనే ప్రజల నుంచి మంచి స్పందన పొందడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పి తాండ సర్పంచు విజయభారతి, సింగరాజన్నహళ్లి సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు లక్ష్మయ్య, చావిడి వెంకటేష్, ఎంపిడిఓ శోభారాణి, ఈఓఆర్డి ప్రభావతి, పంచాయతీ రాజ్ ఏఈ మల్లయ్య, ఏపిఓ తిమ్మారెడ్డి, సూగురు టిడిపి నాయకులు భాస్కర్ రెడ్డి, ఈరన్న, ఈర్నాగప్ప, శేఖర్, శంకరప్ప, రామకృష్ణ, నరసింహులు, గోపాల్, ఇజ్రాయెల్, నాగరాజు, హనుమంతు, బొజ్జప్ప, చెట్నహల్లి టిడిపి నాయకులు చేపల నాగేష్, మేకల మల్లేష్, పూజారి మల్లేష్, డీలర్ నల్లన్న, వీరేష్, చాకలి నరసింహులు, తెలుగు పరమేష్, సింగరాజన్నహళ్లి టిడిపి నాయకులు ఎస్ యం గోపాల్ రెడ్డి, గంగన్న, బసప్ప, హనుమన్న, జగన్నాథ్, హుశేని, నరసింహులు, ప్రకాష్, మల్లన్న, పి తాండ టిడిపి నాయకులు శంకర్ నాయక్, అంజినప్ప నాయక్, రంగస్వామి, కేశవ నాయక్, గోపాల్ నాయక్, సచివాలయ ఉద్యోగులు, కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.