PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దేవరగట్టు బన్నీ ఉత్సవాలు విజయవంతం

1 min read

కలెక్టర్​, ఎస్పీని అభినందించిన జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సురేష్​ కుమార్​

కర్నూలు, పల్లెవెలుగు: దేవరగట్టు బన్నీ ఉత్సవాలను పకడ్బందీగా, ప్రణాళికా బద్ధంగా  నిర్వహించిన కలెక్టర్​ పి. రంజిత్​ బాషా, ఎస్పీ బిందు మాధవ్​ ను బుధవారం జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బి. సురేష్​ కుమార్​ అభినందనలు తెలిపారు.  సాంప్రదాయ బద్ధంగా జరిగిన బన్నీ ఉత్సవాల్లో దాదాపు రెండున్నర లక్షలమంది పాల్గొన్నా.రని, ఉత్సవాల్లో భాగంగా తక్కువ మందికి గాయాల పాలయ్యారన్నారు.  ఉన్నతాధికారుల పకడ్బందీగా తీసుకున్న నిర్ణయాలతో బన్నీ ఉత్సవం విజయవంతమైందన్నారు.   అదేవిధంగా  పోలీస్ , రెవెన్యూ , హెల్త్, పారిశుధ్య సిబ్బందికి కూడా  వేదిక అభినందనలు తెలుపుతుందని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు బి సురేష్ కుమార్ అన్నారు.   అనంతరం  కలెక్టర్ పి. రంజిత్​ బాషా  మాట్లాడుతూ ఎస్పీ ,ఆదోని సబ్ కలెక్టర్,అక్కడి వివిధ విభాగాల సిబ్బంది చక్కగా సమన్వయంతో పనిచేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతాపరెడ్డి రాష్ట్ర కార్యదర్శి శేషాద్రి రెడ్డి, మొహమ్మద్ మియ్య,మంజూరు భాష శ్రీరాములు, రమేష్, రామ లక్ష్మణ్,శివ, బాష, ఆఫ్రిద్ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *