PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యార్ధినులకు బాల్య వివాహాలపై అవగాహన కల్పించాలి

1 min read

బాల్య వివాహాల నిర్మూలనకు టోల్ ఫ్రీనెం.1098 ను మరింత విస్త్రృత పరచాలి

బాలల సంక్షేమానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలి

జిల్లాను బాలల స్నేహపూర్వక జిల్లాగా తీర్చిదిద్దాలి

జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి

పాల్గొన్న వివిధ శాఖల అధికారులు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి :  బాల్యవివాహాల వల్ల కలిగే అనర్ధాలపై విద్యార్ధినులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు.  స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో గురువారం మిషన్ వాత్సల్య రెండవ త్రైమాసిక సమావేశం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధ్యక్షతన జరిగింది.  సమావేశంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్ధ కార్యదర్శి కె .రత్న ప్రసాద్  పాల్గొన్నారు.  ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ బాల్య వివాహాలపై సమాచారం అందించేందుకు జిల్లా అంతటా కూడా 1098 టోల్ ఫ్రీ నెంబరును మరింత విస్త్రృత పరచాలన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్క పౌరుడు చైతన్యవంతులు కావాలని దానికనుగుణంగా ప్రతి  పబ్లిక్ ప్రదేశాల్లో కూడా 1098 నెంబర్ను ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం మిషన్ వాత్సల్య ద్వారా 18 సంవత్సరాల లోపు వయస్సు కలిగి  ఆదరణ,  సంరక్షణ అవసరమైన బాలలందరికీ రక్షణ కల్పింస్తున్నదని అటువంటి బాలలందరూ కూడా మంచి ఉజ్వలమైన భవిష్యత్తును అందిపుచ్చుకోవాలన్నారు.  ఇందుకు అడ్డంకులుగా ఉండే సాంఘీక సమస్యలైన బాల్య వివాహాలు,  స్కూల్ డ్రాప్ ఔట్స్, చైల్డ్ లేబర్ మైగ్రేటెడ్, బిక్షాటన లాంటి వాటి వలలో చిక్కుకోకుండా పిల్లలు బాల్యాన్ని స్వేచ్ఛగా ఆస్వాదించి ఆనందించి మంచి ఉజ్వల్ భవిష్యత్తుకు పునాది వేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  వారికి మంచి భవిష్యత్ అందించేందుకు పనిచేస్తున్న మిషన్ వాత్సల్య పథకం  అమలు జరుపు వ్యవస్థలు డిసిపియు, పిల్లల సంక్షేమ కమిటీ  వారందరూ కూడా సమన్వయంతో పనిచేసి జిల్లాను బాలల స్నేహపూర్వక జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు.  బాలలను చేర్చుకునే హోమ్ లు నిర్వహిస్తున్న వాటిపై ఎన్సీపీసీఆర్ వారి మార్గదర్శకాలకు అనుగుణంగా కానీ జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ ప్రకారం కానీ నియమా నిబంధనలు పాటిస్తూ కచ్చితంగా ఏదో ఒక డిపార్ట్మెంట్ నుంచి అనుమతి పొందిన తరువాత మాత్రమే బాలలను హోమ్ లో చేర్చుకోవాలన్నారు. లైసెన్స్ పొందని రిజిస్ట్రేషన్ లేని హోమ్స్ ఏదైనా ఉంటే గనక వారు వెంటనే వారి వారి బైలాసన్ బేస్ చేసుకుని సంబంధిత శాఖలను సంప్రదించాలన్నారు.సంవత్సరాలు పూర్తయ్యే వరకు ఫాలోఅప్ చేసే విధంగా సంబంధిత మహిళా కార్యదర్శిలకు అప్పజెప్ప వలసిందిగా వారి నుండి నెలవారి నివేదికలు తెప్పించుకోవాల్సిందిగా జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సిహెచ్ సూర్యచక్ర వేణిని ఆదేశించారు. సమావేశంలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ సాధికారత అధికారి కె.ఎల్.వి. పద్మావతి,ఏలూరు డిఎస్పీ డి. శ్రావణ్ కుమార్, ఎల్ డిఎం డి. నీలాధ్రి, డిఈఓ ఎస్. అబ్రహం, డిఎమ్ హెచ్ఓ డాక్టర్ ఎస్. శర్మిష్ట,  సోషల్ వెల్ఫేర్ జెడి వి. జయప్రకాష్, జిల్లా ప్రోహిబిషన్ ఆఫీసరు దుర్గాప్రసాద్, సిపివో బి. శ్రీదేవి, డిఎస్ డివో శ్రీనివాసరావు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఎడి బి. రామ్ కుమార్,  జువెనైల్  వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సిడబ్ల్యుసి సభ్యులు ఇతర అధికారులు పాల్గొన్నారు.

About Author