PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మద్యం షాపులు..ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరి

1 min read

ఎమ్మార్పీ ధరలకే మద్యం

జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి

ఇద్దరు నాటసారా వ్యక్తులు అరెస్ట్..

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నూతనంగా మద్యం షాపులు దక్కించుకున్న నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని లేని యెడల మద్యం షాపులపై తగిన చర్యలు తీసుకోవలసి ఉంటుందని కర్నూలు జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్  డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి అన్నారు.గురువారం ఉదయం 11 గంటలకు నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ ను ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు.మద్యం షాపులు మరియు నాటు సారా వంటి వాటిపై నందికొట్కూరు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సీఐ ఎస్ రామాంజనేయులు కు డిప్యూటీ కమిషనర్ పలు సూచనలు సలహాలు తెలియజేశారు.ఈ సందర్భంగా నూతన మద్యం పాలసీలో భాగంగా మద్యం షాపులను త్వరగా ప్రారంభించే విధంగా చూడాలని మద్యం అమ్మకందారులు తప్పని సరిగా సమయపాలన పాటించాలని మద్యం బాటిలపై ఉన్న ప్రభుత్వ రేట్లకే మద్యం అమ్మాలని నూతన మద్యం షాపులు గుడి, పాఠశాల,చర్చి మసీదు దేవాలయాలు అను వీటికి వంద మీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలన్నారు.కొత్త వ్యాపారస్తులు నిబంధనల మేరకే నడుచుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.అదేవిధంగా నాటు సారా మీద దృష్టి సారించి ఎవరైనా సారా అమ్మినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నాటు సారా తయారీకి ప్రధాన వనరు లైన బెల్లంను సరఫరా చేసే వారిని మీద నిఘా ఉంచాలని సూచించారు.అనంతరం కార్యాలయాల రికార్డులను పరిశీలించారు. స్టేషన్ ప్రస్తుతం ఉన్న కండిషన్ చూసి,స్టేషన్ రిపేర్ కొరకు నివేదిక తయారుచేసి పంపించాలని అన్నారు. తర్వాత అల్లూరు గ్రామంలో నాటు సారా అమ్ముతున్న అడ్డాకుల మల్లికార్జున,తెలుగు ఈశ్వరయ్య వీరి వద్ద నుండి 20 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని వీరిని నందికొట్కూరు రిజిస్టర్ ముందు హాజరు పరిచినట్లు సీఐ రామాంజనేయులు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్టేషన్ ఎస్ఐ జఫురుల్లా మరియు సిబ్బంది పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *