జిల్లాలో 32 ప్రత్యేక కౌంటర్ల ద్వారా తక్కువ ధరకే పామాయిల్,సన్ ఫ్లవర్
1 min readప్రతినెలా ఒకటో తేదీ నుంచే నిత్యావసర సరుకుల పంపిణీ సక్రమంగా నిర్వహించాలి
జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి
డీలర్లు,వర్తక సంఘాల ప్రతినిధులు,చాంబర్ ఆఫ్ కామర్స్ యాజమాన్యంతో సమావేశం
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : జిల్లాలో ప్రతినెలా ఒకటో తేదీనుంచే నిత్యవసర వస్తువులు పంపిణీ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి.దాత్రిరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. స్ధానిక కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి అధ్యక్షతన పౌరసరఫరాల శాఖ అధికారులు, సిబ్బంది, చౌక ధరల దుకాణం డీలర్ల ప్రెసిడెంట్ , మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ ఆపరేటర్లు, వివిధ ఆయిల్ వర్తక సంఘాల , చాంబర్ ఆఫ్ కామర్స్ యాజమాన్యంతో సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ చౌక ధరల దుకాణం మరియు ఎండియూ ఆపరేటర్లకు కందిపప్పు ఎక్కువ సబ్సిడీ ఉండుటచే ముందుగానే విడిపించి , ప్రతినెలా ఒకటవ తేదీ నుండి పదవ తేదీ లోపు కార్డుదారులందరికీ పంపిణీ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిత్యవసర సరుకులు అన్నియు ప్రజలకు అందుబాటులో ఉంచడం జరుగుచున్నదన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు ధరలను అదుపులోనికి తెచ్చే విధంగా చర్యలను తీసుకోవడం జరిగిందన్నారు. ఇప్పటికే జిల్లాలో 32 పామాయిల్ , సన్ ఫ్లవర్ తక్కువ ధరతో అందించే ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. గతంలోనే అన్ని రైతు బజార్లలో, డి మార్ట్, మోర్, రిలయన్స్ తదితర మార్కెట్లలో బియ్యం , కందిపప్పు లను సబ్సిడీపై ప్రజలకు బాటులో అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. సమావేశంలో జిల్లాపౌర సరఫరాల అధికారి ఆర్. సత్యనారాయణ రాజు, పౌర సరఫరాల సంస్ధ జిల్లా మేనేజరు శ్రీలక్ష్మి , ఛాంబర్ ఆఫ్ కామర్సు ప్రెసిడెంట్ నేరెళ్ళ రాజేంద్ర, పలువురు అధికారులు పాల్గొన్నారు.