గ్రామాలలో మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం సంక్షేమం,అభివృద్ధి కార్యక్రమాలు
1 min readజాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మరిన్ని కార్యక్రమాలు
జిల్లా కలెక్టర్ కె వెట్రీ సెల్వి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి, కార్యక్రమాల లక్ష్యాలను నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమేవేశపు హాలులో శుక్రవారం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల అమలును అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ పేద ప్రజలు, రైతుల సంక్షేమానికి, గ్రామాలలో మౌలిక సదుపాయాలకు ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు. ప్రధానమంత్రి ఆవాసయోజన, ఫసల్ భీమా యోజన, పిఎం ఎంప్లాయిమెంట్ గ్యారంటీ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం, సంసద్ ఆదర్శ్ యోజన, జల్ జీవన్ మిషన్, మాతృత్వ వందన యోజన, బీటీ బచావో , భేటీ పడావో, పరంపరాగత కృషి వికాస యోజన, గ్రామ సడక్ యోజన, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్,పిఎం పోషణ అభియాన్, తదితర కార్యక్రమాలకు సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్ర భవనాలు, టాయిలెట్ల నిర్మాణం, సమగ్ర శిక్ష కార్యక్రమంలో అదనపు తరగతి గదుల నిర్మాణం, గ్రామ సడక్ యోజన పధకం కింద గ్రామాలలో రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం లో మరిన్ని కార్యక్రమాలు వేతనాలు పద్దు కింద చేపట్టి పూర్తి చేస్తే, జిల్లాకు మరిన్ని పనులు మంజూరయ్యే అవకాశం ఉందని, అధికారులు ఈ దిశగా కృషిచేయాలన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ కె. సుబ్బారావు, డిపిఓ అనురాధ, డిఆర్డిఏ పీడీ డా:విజయరాజు,వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక శాఖల జేడీ హబీబ్ భాష, నెహ్రూబాబు,జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. శర్మిష్ఠ, డీఈఓ అబ్రహం, జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్. సత్యనారాయణ రాజు, ఎంఐపి పీడీ రవికుమార్, ఉద్యానవనాలు శాఖ డిడి రామ్మోహన్, డ్వామా పీడీ కె.వి. సుబ్బారావు, ప్రభృతులు పాల్గొన్నారు.