ఉత్తమ పురస్కారాలకు.. దరఖాస్తు చేసుకోండి
1 min read– మౌలానా అబుల్ కలాం ఆజాద్, డా.అబ్దుల్ హఖ్ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోండి
- ఈ నెల 25న చివరి గడువు
- ముస్లిం మైనార్టీ జిల్లా సంక్షేమ శాఖ అధికారి సబిహ పర్వీన్
కర్నూలు, పల్లెవెలుగు:ఉర్దూబాష అభివృద్ధి మరియు సాహిత్య, విభిన్న విభాగాలలో అత్యత్తమ సేవలు అందించిన వారికి నవంబరున 11న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి పురస్కరించుకుని మౌలానా అబుల్ కలాం ఆజాద్ జాతీయ స్థాయి పురస్కారం మరియు డా. అబ్దుల్ హఖ్ ప్రాంతీయ స్థాయి పురస్కారం అందజేయనున్నట్లు ముస్లిం మైనార్టీ జిల్లా సంక్షేమ శాఖ అధికారి సబిహ పర్వీన్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ముస్లిం మైనార్టీల సంక్షేమ దినోత్సవం మరియు జాతీయ విద్యాదినోత్సవంగా జరుపుకుంటున్న నవంబరు 11న అత్యత్తమ సేవకులకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ పురస్కారం (రూ.1,25,000/- ప్రోత్సాహకం, సర్టిఫికేట్ మరియు మెమెంటో) మరియు డాక్టర్ అబ్దుల్ హఖ్ ప్రాంతీయ స్థాయి పురస్కారం(రూ.1,00,000/- ప్రోత్సాహకం, సర్టిఫికేట్ మరియు మెమెంటో) అందించనున్నారు. అలాగే రాష్ట్రానికి చెందిన ఉర్దూ సాహితీవేత్తలకు, పండితులకు (స్కాలర్), కవులు, పాత్రికేయులకు, విమర్శ, పరిశోదన, గద్య బోధన మరియు ఉర్దూ సేవకులకు ఇలా వివిధ విభాగాలలో సేవలు అందించిన ఆరుగురికి ” జీవిత కాల సాఫల్య పురస్కారాలు” అందించనున్నారు. ఇదేవిదముగా ఉర్దూ భాషాభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు ” ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం” మరియు ఉర్దూ భాషలో అత్యున్నత శ్రేణిలో రాణించిన విద్యార్థులకు ” ఉత్తమ విద్యార్థి పురస్కారం” కూడా అందించనున్నారని తెలియజేశారు.
25న దరఖాస్తుకు చివరి గడువు
పురస్కారముల కొరకు దరఖాస్తులను ఉర్దూ అకాడమీ ద్వారా జారి చేయబడిన దరఖాస్తు పారము పూరించి పాటశాల కు చెందిన ఉపాద్యాయులు మరియు ప్రధానోపాద్యాయులు డి.ఇ.ఓ/డిప్యుటీ ఇ.ఓ ద్వారా, ఇంటర్ మరియు డిగ్రీ కళాశాల లకు చెందిన ఉపాధ్యాయులు కళాశాల ప్రిన్సిపాల్ మరియు డి.ఇ.ని ఓ./ఆర్.ఐ.ఓ ద్వారా, విశ్వవిద్యాలయ ఉపాద్యాయులు ప్రిన్సిపాల్/రిజిస్టార్ ద్వారా ప్రమాణ ప్రతులను జతపరుస్తూ తేది: 25.10.2024 లోపల మరియు జీవిత సాఫల్య పురస్కారము కొరకు రాష్ట్రానికి చెందిన ఉర్దూ సాహితీవేత్తలు, పండితులు (స్కాలర్), కవులు, పాత్రికేయులు, విమర్శ, పరిశోదన, గద్య బోధన మరియు ఉర్దూ సేవకులు కూడా ప్రతిపాదనలను డా// మహమ్మద్ మస్తాస్, డైరెక్టర్/సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ స్టిట్ ఉర్దూ అకాడమీ, డోర్ నెం: 76-1-6A/182, మాలవికా విల్లా, హెచ్.బి. కాలని, భవానిపురం, విజయవాడ – 520012 అనే చిరునామా కు స్వయంగా లేదా పోస్టు / కొరియర్ ద్వారా పంపవలసినది కోరారు.