PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సెయింట్ తెరిసా మహిళా కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

1 min read

మనల్ని కాపాడే ఒకే ఒక్క ఆయుధం స్ట్రాంగ్ పాస్వర్డ్

పాస్వర్డ్ 8 అంకెలకంటే తక్కువ ఉండకూడదు

పల్లె వెలుగు, ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు సెంట్ థెరిసా  మహిళా కళాశాలలో విద్యార్థినిలకు  అవగాహన కార్యక్రమాలను ఈ రోజు అనగా శనివారం నాడు నిర్వహించినారు.ఈ సందర్భంగా మాట్లాడుతూసోషల్ మీడియా మాధ్యమాలలో సైబర్‌ కేటుగాళ్ల బారిన పడకుండా మనల్ని కాపాడే ఒకే ఒక్క ఆయుధం స్ట్రాంగ్‌ పాస్‌వర్డ్‌, ఈ పాస్వర్డ్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని సూచించారు.మనం ఇంటి నుంచి బయటికెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇంటికి తాళం వేస్తాం. ఒకటికి, రెండుసార్లు సరిగ్గా వేశామో లేదో తనిఖీ చేసుకుని బయటకు వెళ్తాం. అలాగే  సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్‌ బ్యాకింగ్‌, యూపీఐ (ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం తదితరాలు), ఫోన్‌ పాస్‌వర్డ్‌ల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులు ప్రజలకు తెలియజేశారు. తేలికైన పాస్‌వర్డ్స్‌ను పెట్టుకుంటే. సైబర్‌ కేటుగాళ్ల చేతికి తాళాలు మనమే ఇచ్చినట్లు అవుతుందని  తెలిపారు.అపరిచిత వ్యక్తులు పంపించే లింకులు గానీ మెసేజ్లు గాని స్పందిస్తే నష్టపోతారని తెలిపారు. వివిధ కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన అనతి కాలంలోనే ఎక్కువ రాబడి వస్తుంది అని చెప్పి ఆశలు చూపించే కంపెనీలు యొక్క వివరాలు తెలుసుకోకుండా డబ్బులు పెడితే నష్టపోతారని, కంపెనీ యొక్క స్థితిగతులను గురించి ముందుగా ప్రజలకు తెలుసుకోవాలన్నరు.గూగుల్‌, ఫేస్‌బుక్‌, జీమెయిల్‌, ఇన్‌స్టాగ్రాం, ఇంటర్నెట్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ ఇలా అన్నింటికీ సంబంధించిన పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవడం చాలా కష్టమని భావించి అన్నింటికీ ఒక్కటే పాస్‌వర్డ్‌ పెట్టుకుంటున్నారు. ఒక్కదాని పాస్‌వర్డ్‌ల తెలిస్తే అన్ని ఖాతాల గుట్టు సైబర్‌ కేటుగాళ్ల చేతికి చిక్కుతుందని, ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ అప్రమత్తం కావాలని విజ్ఞప్తి చేశారు. సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండేందుకు స్ట్రాంగ్ పాస్‌వర్డ్ పెట్టుకోవడం వల్ల అధిక భద్రత లభిస్తుందని, లేదంటే బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుందని, బలమైన పాస్‌వర్డ్ ఎలా సెట్ చేసుకోవాలో ఈ క్రింద విధంగా తెలిపారు. పుట్టిన తేది, పెళ్ళి రోజు, పిల్లలు, భాగస్వామి పేర్లు వంటివి పాస్‌వర్డ్స్‌లో పెట్టుకోవద్దు. వీటి వల్ల సులభంగానే పాస్‌వర్డ్‌ను హ్యాక్ చేసే ప్రమాదముంది.పాస్‌వర్డ్‌ కచ్చితంగా 8 అంకెల కంటే తక్కువ ఉండకూడదు. అక్షరాలతో పాటు నెంబర్లు, గుర్తులను జత చేయాలి. అప్పుడు పాస్‌వర్డ్‌ని బ్రేక్‌ చేయడానికి హ్యాకర్‌కి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ప్రతి మూడు నెలలకోసారి మీ పాస్‌వర్డ్‌ని మార్చుకుని, రీ సెట్‌ చేసే అలవాటును పెంచుకోవాలి. అన్ని పాస్‌వర్డ్‌లను సెపెరేట్ వుంచండన్నరు. పాస్‌వర్డ్‌ని ఇతరులతో ఎప్పుడూ షేర్ చేయకండి. పాస్‌వర్డ్‌ని గుర్తుంచుకోవడం కోసం కాగితాలపై రాసి  పర్సులో పెట్టుకోవడం వంటివి చేయకండన్నరు.సైబర్ క్రైమ్ బారిన పడినవాళ్లు తక్షణం సహాయం కోసం https://cybercrime.gov.in లేదా హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు కాల్ చేయండి లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ లలో  ఫిర్యాదు చేయాలని, బాధితులకు అండగా పోలీస్ శాఖ ఎల్లవేళల ఉంటుందని జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు ప్రతి ఒక్క విద్యార్థికి తెలియ చేశారు. కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు, మహిళా ఎస్సై కాంతిప్రియ, ఏలూరు సైబర్ సెల్ పోలీస్ స్టేషన్ ఎస్సై మధు వెంకటరాజా, విద్యార్థిని విద్యార్థులు కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author