గ్రామస్తుల అనుమతి లేకుండా సోలార్ ఎలా..?
1 min readవెళ్లిన తహసిల్దార్ ను అడ్డగించిన గ్రామస్తులు
సోలార్ రద్దు చేయాలని డీటీ కి గ్రామస్తుల వినతి..
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): మా గ్రామ పంచాయితీ తీర్మానం మరియు గ్రామస్తుల ఆమోదం లేకుండా మా గ్రామంలో ఏ విధంగా సోలార్ ప్రాజెక్టును మంజూరు చేస్తారని అధికారులపై గ్రామస్తుల ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని సోలార్ ప్రాజెక్టు కొరకు గతంలో పైపాలెం, నాగలూటి పొలిమేరలో-728 ఎకరాలు మరియు మాసపేట పొలిమేర-282 ఎకరాలు అప్పట్లో పొలాన్ని అప్పటి రెవెన్యూ అధికారులు నివేదిక పంపారు.సోలార్ ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని అంతే కాకుండా ఈ పొలాలను స్వాధీనం చేసుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి మిడుతూరు తహసిల్దార్ శ్రీనివాసులు ను ఆదేశించడంతో తహసిల్దార్ మరియు ఆర్ఐ జహంగీర్, వీఆర్వోలు సుందర రాజు, సంజీవ రాజు రెవెన్యూ సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు.విషయం తెలుసుకున్న గ్రామస్తులు గట్టు మీదికి వెళ్లి అధికారులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు జగన్ మోహన్ రెడ్డి,లింగేశ్వర రెడ్డి అధికారులతో మాట్లాడుతూ 1978 లో మా గ్రామం పంచాయతీగా ఏర్పడిందని అంతేకాకుండా 2002 లో రెవెన్యూ గ్రామంగా గుర్తిస్తూ గెజిట్ విడుదల చేశారని గ్రామస్తులు వారికి తెలియజేశారు.ఇక్కడ సోలార్ పనులు వద్దని వారు ఖరా కండిగా చెప్పారు.అక్కడ జరుగుతున్న పనులను ప్రజలు అడ్డుకొని పనులను ఆపి వేయించారు.శనివారం మధ్యాహ్నం సోలార్ వద్దని కోరుతూ మిడుతూరు తహసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్ శరత్ కుమార్ రెడ్డికి గ్రామ సర్పంచ్ మరియు గ్రామస్తుల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని ఇనాయతుల్ల,మర్రి రామేశ్వరుడు,శేఖర్ తదితరులు వినతిపత్రం అందజేశారు.