PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మధ్యంతరభృతిని వెంటనే ప్రకటించాలి: ఆప్టారాష్ట్ర కార్యవర్గ తీర్మానం

1 min read

పల్లెవెలుగు వెబ్  అనంతపురం:  ఏ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నేడు ఉపాధ్యాయ భవన్ లో  అనంతపురం పట్టణం నందు ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడు ఏ జి ఎస్ గణపతి రావు అధ్యక్షతన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకి ప్రకాష్ రావు పర్యవేక్షణలో జరిగినది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు  ఎ జి ఎస్ గణపతి రావు గారు మాట్లాడుతూ జీవో 117 రద్దుచేసి ప్రతి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలు 1నుంచి 5 తరగతులు పునరుద్ధరణ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మద్యంతర భృతిని ప్రకటించి 12వ పే రివిజన్ కమిషన్ నియమించాలని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకి ప్రకాష్ రావు ప్రసంగిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెంచేందుకు ప్రాథమిక ఉపాధ్యాయులు అందరూ కృషి చేయాలి తద్వారా  ప్రభుత్వం నకు ప్రాథమిక  విద్య పై ప్రత్యేక ఆసక్తి కల్పించాలి అని అన్నారు.పాఠశాలలో నిత్యం ఉన్న యాప్లు భారాన్ని తగ్గించాలని  అన్నారు .సిపిఎస్ మరియు జిపిఎస్ లను రద్దుచేసి పాత పెన్షన్  విధానాన్ని పునరుద్ధరణ చేసే వరకు పోరాటం చేయాలని  రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంటు మహాడీ అన్నారు.రాష్ట్ర అదనపు ప్రధాన కార్య దర్శి ఆర్ మురళీ మోహన్ గారు ప్రసంగిస్తూ ఎం టి ఎస్ ఉపాధ్యాయులు సర్వీసును క్రమ బద్దీకరణ చేయాలి .జిల్లా పరిషత్ మునిసిపల్ పాఠశాలలో పనిచేస్తున్న ఆర్ట్ క్రాఫ్ట్ కాంట్రాక్టు(PTI) టీచర్లను మినిమం టైం స్కేల్ ఇవ్వాలని అన్నారు.అనంత పురం జిల్లా అధ్యక్షుడు  సి  గోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ గతంలో ఉన్న విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తిని విద్యా హక్కు చట్టం ప్రకారం నిర్ణయించాలని . కొత్త పిఆర్సి లో హెచ్ఆర్ఏ రేట్లు పదవ పిఆర్సి లో ఉండేలాగా నిర్ణయించాలని  అన్నారు. అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి కె వెంకట రత్నం మాట్లాడుతూ 12 ఏళ్ల సర్వీసు పూర్తి చేసినటువంటి సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ గా పరిగణించాలని తల్లికి వందనం ద్వారా ఇచ్చే ఆర్థికలబ్దిని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు మాత్రమే వర్తింప చేయాలి  సీఎం ఎఫ్ ఎస్ లో  ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే రిలీజ్ చేయాలని కామన్ సర్వీస్ రూల్స్ అమలు చేస్తూ ఉపాధ్యాయుల ప్రమోషన్లను ప్రతి నెల జరిపేలా చర్యలు తీసుకోవాలి కర్నూలు జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో జరగబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డిగ్రీ అర్హత కలిగినటువంటి ఎస్జీటీలకు ఓటు హక్కును కల్పించాలి  అన్నారు. ఈ విషయాలు అన్నిటి పై రాష్ట్రం లోని అన్ని జిల్లాల నుంచి హాజరు అయిన రాష్ట కార్యవర్గ సభ్యులు మరియు జిల్లా అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు ఏకగ్రీవంగా ఆమోదించారు. దీని పై ప్రభుత్వం తో ప్రాతినిధ్యం చేయాలని తీర్మానించారు.ఈ కార్యక్రమం లో అనంతపురం జిల్లా నుండి జిల్లా ఆర్థిక కార్యదర్శి శంకర్ మూర్తి, జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి జిల్లా నాయకులు నారాయణ, కుల్లాయప్ప, సూర్యనారాయణ ,నరేష్, వలి, సుంకన్న, లింగన్న  మరియు  ఇతర నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

About Author