‘ఏపీఆర్ఎస్ఏ ’ బలపేతమే లక్ష్యం..
1 min readసభ్యుల ఆమోదంతోనే… నిర్ణయం
ఏపీఆర్ఎస్ఏ నూతన జిల్లా అధ్యక్షుడు సి. నాగరాజు
రాష్ట్ర ఉపాధ్యక్షుడు అల్లంపాటి పెంచల రెడ్డి నేతృత్వంలో కర్నూలు జిల్లా అధ్యక్ష , కార్యదర్శి , రాష్ట్ర కార్యవర్గ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆంధ్ర ప్రదేశ్ రెవెన్యూ అసోసియేషన్ ను మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని, తీసుకునే ప్రతి నిర్ణయమూ సభ్యుల ఆమోదంతోనే తీసుకుంటామని స్పష్టం చేశారు ఏపీఆర్ ఎస్ఏ కర్నూలు జిల్లా నూతన అధ్యక్షుడు సి. నాగరాజు. ఇటీవలె కర్నూలు జిల్లా అధ్యక్ష పదవికి గిరికుమార్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆదివారం అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అల్లంపాటి పెంచల రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో కర్నూలు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో నాలుగు డివిజన్ల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సి. నాగరాజు, జిల్లా కార్యదర్శి ఎం. లక్ష్మీ రాజుమరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ( ఆర్గనైజింగ్ సెక్రటరీగా) కే. రజనీకాంత్ రెడ్డి తో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ బైలాస్ ను అనుసరించి వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు సి. నాగరాజు మాట్లాడుతూ రెవెన్యూ అసోసియేషన్ సభ్యుల సహకారం… సమన్వయంతోనే ముందుకెళ్తామని పేర్కొన్నారు. ఆ తరువాత జిల్లా కార్యదర్శి లక్ష్మీరాజు మాట్లాడుతూ సభ్యుల ఆమోదంతోనే అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకోవడం సంతోషంగా ఉందని, ఎవరిని నొప్పించకుండా పని చేస్తానని హామీ ఇచ్చారు.ఏపీఆర్ఎస్ఏ కు బాధ్యతగా ఉంటా: రజినికాంత్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుఏపీ రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ…. పదవిని బాధ్యతగా స్వీకరించి.. ఏపీఆర్ఎస్ఏ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు రజినికాంత్ రెడ్డి. అసోసియేషన్ ఒకరి పై ఆధారపడి కొనసాగదని, తీసుకున్న ప్రతి నిర్ణయం సభ్యులందరితో చర్చించి తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సుస్పష్టం చేశారు. రాష్ట్రంలోనే ఏపీఆర్ఎస్ఏ బలోపేతానికి కృషి చేయడంతోపాటు మంచి పేరు తీసుకువచ్చేలా కృషి చేస్తానని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రజినికాంత్ రెడ్డి వెల్లడించారు.