హిందూ సమాజంలో వృత్తులను బట్టి మాత్రమే కులాలు…
1 min readవిశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ సామాజిక సమరసత ప్రముఖ్ దేవ్ జీ భాయ్ రావత్…..
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: హిందూ సమాజం లో వృత్తులను బట్టి మాత్రమే కులాలు ఏర్పడ్డాయని, కులాల మధ్య హెచ్చు,తగ్గులు లేవని, యుగ యుగాలుగా ఇది ప్రస్ఫుటంగా నిరూపించే పడిందని,మన ప్రధాన ఇతిహాసాలైన రామాయణ,భారత, భాగవతాది దివ్య గ్రంథాలలో ఈ విషయం నిరూపితమైంది, ఐతే దీనికి పెడార్థాలు తీస్తూ కొందరు కుహనా లౌకిక వాదులు, మతమార్పిడి చేసేవారు, తమ రాజకీయ పబ్బం గడుపు కోనే వారు కులాల మధ్య లేని విభేదాలను సృష్టిస్తూ కులాల కుంపట్లు రగిలించి వారి స్వంత ఎదుగుదలకు వాడుకుంటున్నారని విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం, భరతమాత ఆలయం,రెవెన్యూ కాలనీ లో ఈరోజు సాయంకాలం 6:00 గం.లకు జరిగిన “కుల సంఘాల సమన్వయ సమావేశం” లో కేంద్రీయ సామాజిక సమరసత ప్రముఖ్ దేవ్ జీ భాయ్ రావత్ దుయ్యబట్టారు. ఇంకా మాట్లాడుతూ ప్రతి కులానికి సాటి కులం అవసరం ఉన్నదని ఏ సమాజాన్నైతే “తక్కువజాతి” అంటున్నారో ఆయా కులాలు లేకపోతే “ఎక్కువ జాతి” కులాలు అనబడే వారు సుఖంగా జీవించగలరా…? అని ప్రశ్నించారు, “తక్కువజాతి” వారుగా ముద్ర పడి అవమానాలు ఎదుర్కొంటున్నారో ఆయా కులాల్లోనే ఎందరో మహానుభావులు జన్మించారని మన జిల్లా వారైన డా. బాబూ జగ్జీవన్ రామ్, సర్దార్ నాగప్ప, దామోదరం సంజీవయ్య, అలాగే ఇతర రాష్ట్రాల వారైన ఝల్కారీబాయి, మతాదిన్ భాగీ, మదాదేవి, మహావిరీదేవి, బాబా మంగు రాం, జిడి తపసే, డా. బి.ఆర్. అంబేద్కర్, భోలా పాశ్వాన్, పన్నా లాల్ బరుపాల్, మొదలైన దళిత స్వాతంత్య్ర సమరయోధులు భారత స్వాతంత్య్ర పోరాటం లో పాల్గొన్నారు.అలాగే ధార్మిక సమాజంలో కూడా సంత్ రవిదాస్ వంటి మహానుభావులు ఉన్నారు.విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా అధ్యక్షులు టి.సీ.మద్దిలేటి మాట్లాడుతూ కులాలు మధ్య చిచ్చు ను రేపే వారినుండి మన కులాలు సంరక్షించబడాలంటే కులాలు కలవడం ఒక్కటే మార్గమని అందుకే మన సాధు సంతులు “గడపలోపలే కులం – గడపదాటితే హిందువులం” అన్న నినాదాన్ని సమాజినికి అందించారని ఈ రోజు ఇక్కడి వచ్చిన కుల సంఘాల నాయకులు ఈ నినాదాన్ని అవగతం చేసుకుని తమ తమ సంప్రదాయాలను పాటిస్తూనే సోదర కులాలు వారితో సఖ్యతగా ఉంటే సరిపోతుందని, హిందూ దేవాలయాల విషయంలో ,హిందూ హక్కుల విషయంలో, హిందూ సమాజానికి ఇతర సమాజాలు నుండి వచ్చే అన్ని సమస్యల కోసం… మన అన్ని కులాల వారు సంఘటితమైతే సునాయాసంగా వాటిని సాధించే వెచ్చని, అలాగే పండుగ దినాల్లో ఒక కులం వారు మరో కులాన్ని తమ ఇళ్ళకు భోజనానికి ఆహ్వానించి వారితో కలిసి భుజించాలని , మనం కూడా వారి ఇళ్ళకు వెళ్ళి భోజనం చేయాలని పిలుపునిచ్చారు.