విజయవంతంగా ముగిసిన ఫెన్సింగ్ క్రీడలు..
1 min readజమ్మూ కాశ్మీర్ లో జరిగే పోటీల్లో ప్రతిభ కనబరచాలి
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్ కు పేరు తీసుకురావాలి: నంద్యాల జిల్లా టిడీపీ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ అన్నారు.గత రెండు రోజులుగా నంద్యాల పట్టణంలో స్థానిక పద్మావతి నగర్ జిల్లా క్రీడల అథారిటీ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న అండర్-17 బాల బాలికల రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ క్రీడలు నిన్నటితో ముగిశాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల జిల్లా టిడీపీ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్,గురురాజా బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ డైరక్టర్ మౌలాలి రెడ్డి,ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గౌరవాధ్యక్షులు నిమ్మకాయల సుధాకర్, ఒలంపిక్ అసోసియేషన్ సెక్రెటరీ రామాంజనేయులు, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చలం బాబు, సీనియర్ రిపోర్టర్ మరియు కౌన్సిలర్ శ్యాం,హుస్సేన్, రగ్బీ సౌత్ ఇండియా అబ్జర్వర్ వికాస్,నోయల్,డా.సకారం హజరయ్యారు.ఈ సందర్భంగా ఫిరోజ్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఎంపికైన ఆంధ్ర ప్రదేశ్ క్రీడాకారులు జమ్మూ కాశ్మీర్ లో జరిగేటటువంటి జాతీయ స్థాయి పోటీల్లో చక్కటి ప్రతిభ కనబరిచి- విజేతలుగా తిరిగి రావాలని ఆకాంక్షించారు.అనంతరం అతిథులు ఇప్పి , షాబర్,ఫాయిల్ విభాగాల్లో టీమ్ ఈ వెంట్లలో వ్యక్తిగత ఈవెంట్లలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు సర్టిఫికెట్లు మరియు మెడల్స్ అందజేశారు.ఈ సందర్భంగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వాహక కార్యదర్శి శ్రీనాథ్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ క్రీడల విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫెన్సింగ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ స్టేట్ అబ్జర్వర్ రాఘవేంద్ర,ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఏపీ రెడ్డి నంద్యాల జిల్లా కార్యదర్శి దండే నాగరాజు ఏపీ పీఈటి అండ్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రధాన కార్యదర్శి రవికుమార్,టోర్నమెంట్ టెక్నికల్ అడ్వైజర్ విశ్వనాథ్, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఫెన్సింగ్ కోచ్ లు మహేష్, లక్ష్మణ్ సీనియర్ ఫిజికల్ డైరెక్టర్లు సోలమన్, రాజశేఖర్,వెంకటేష్,సుంకన్న, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.