దుర్గగుడి ఈవోకు మున్సిపల్ అధికారులు నోటీసులు
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ: పన్ను బకాయిలు కట్టాలంటూ దుర్గగుడి ఈవోకు మున్సిపల్ అధికారులు నోటీసు ఇవ్వడం సబబు కాదు. భక్తుల సౌకర్యార్థం నిర్మించిన రాజగోపురం, మల్లిఖార్జున మహామండపంపె, సీవీ రెడ్డి ఛారిటీస్ స్థలంలో ఉన్న కట్టడాలపై ఆస్తి పన్ను విధిస్తారా? గతంలో దేవాదాయ శాఖ కమిషనర్ హిందూ ధార్మిక సంస్థలకు చెందిన నిర్మాణాలకు నోటీసులు ఇవ్వరాదని ఇచ్చిన ఉత్తర్వులను నగరపాలక సంస్థ అధికారులు పట్టించుకోరా? భక్తుల సౌకర్యార్థం నిర్మించిన వాటికి పన్నులేంటి? ఇదేమన్నా వ్యాపార సముదాయాలు అనుకున్నారా? రాష్ట్రంలో ప్రఖ్యాతి గాంచిన ఇటువంటి దేవస్థానాలు వేటికి పన్నులు కట్టమంటూ నోటీసులిచ్చిన దాఖలాలు లేవు. ధార్మిక సంస్థల యెడల వ్యాపార ధోరణితో నగరపాలక సంస్థ వ్యవహరించడం అన్యాయం, అక్రమం. కనకదుర్గమ్మ వారి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా నగరపాలక అధికారులు వ్యవహరించడాన్ని ఖండిస్తున్నాం. నగరపాలక అధికారులకు చేతనైతే పారిశుధ్యం, డ్రెయినేజీ, మంచినీరు సరఫరాకు సంబంధించి రైల్వేకి అందిస్తున్న సేవలకు సంబంధించి రావాల్సిన కోట్ల రూపాయల పన్ను బకాయిలను వసూలు చేయాలి. నగరపాలక సంస్థ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న రైల్వే డీఆర్‌ఎం ఆఫీసుకు వెళ్లి ఈ విషయమై నోటీసులివ్వాలి. తగదు నమ్మా… అంటూ అమ్మవారి సన్నిధికి వచ్చి… పన్నులు కట్టమంటూ కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇవ్వడం అమ్మవారి భక్తుల మనోభావాలను గాయపర్చినట్లే. తక్షణం ఈ విషయమై మున్సిపల్ శాఖ మాత్యులు స్పందించాలి. విజయవాడ నగరపాలక సంస్థ అధికారుల దుందుడుకు చర్యల్ని అడ్డుకోవాలి. భక్తుల సౌకర్యార్థం నిర్మించిన కట్టడాలపై తక్షణ పన్నులు రద్దు చేయాలి.