NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వరుణుడి రాకతో పొంగి పొర్లిన వాగులు వంకలు..

1 min read

కడుమూరు,మిడుతూరులో రోడ్లపై వర్షపు నీళ్లు..

మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్​ నేడు : ఆదివారం రాత్రి నుండి కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లాయి.ఆదివారం రాత్రి నుండి సోమవారం ఉదయం వరకు అతి భారీ వర్షం పడడంతో రైతుల్లో ఆనందం వెల్లి విరిసింది.వేసిన పంటలు మొక్కజొన్న,పత్తి తదితర పంటలకు వర్షం రాకతో పంటలు సమృద్ధిగా వస్తాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని మిడుతూరు కాకలేరు వాగు,తలముడిపి దగ్గర ఉన్న వాగు చెరుకుచెర్ల- బైరాపురం మధ్యలో ఉన్న పెద్దవాగు రోడ్డుపై నీళ్లు రావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదేవిధంగా పీరు సాహెబ్ పేట రహదారిపై పొలాల నుండి వచ్చిన నీళ్లు రావడం పట్ల గనేట్ గుంతలు నిండిపోయాయి.49 బన్నూ రు కుందూ బ్రిడ్జిపై నీళ్లు వచ్చాయి.చెరుకుచెర్ల దగ్గర ఉన్న బ్రిడ్జి క్రిందికి ఉండటం వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు చేసుకుంటున్నారని బ్రిడ్జి ఎత్తును పెంచాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు. కడుమూరు గ్రామంలో పొలాల నుండి వచ్చే నీళ్లు అధికంగా రావడంతో రోడ్లపై నీళ్లు విపరీతంగా వస్తూ ఉన్నాయ్. మిడుతూరు బస్టాండ్ ప్రాంగణంలో వర్షం నీళ్లు విపరీతంగా రావడంతో ప్రయాణికులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

About Author