రైతుకు పాము కాటు… తప్పిన ప్రమాదం
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పొలంలో నీళ్లు కట్టడానికి వెళ్లిన రైతు పాము కాటుకు గురవగా, తక్షణమే స్పందించి ఆసుపత్రికి చేరుకొని చికిత్స చేయించుకుని ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. మండల పరిధిలోని జూటూరు గ్రామానికి చెందిన వడ్డే కోసిగి నరసప్ప మిరప చేనుకు నీళ్లు కట్టేందుకు మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో వెళ్లారు. మోటారుకు నీళ్లు రావడంలేదని ఫుట్బాల్ కు ఏమైనా అడ్డం పడిందా అని చూసే క్రమంలో ఫుట్బాల్ లొ పాము ఉంది అది చూసి గమనించే లోపే రైతు వడ్డే నరసప్ప చేతికి పాము కాటు వేసింది. హుటా హుటిన పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడంతో సూపర్ డెంట్ డాక్టర్ కల్పన పాము కాటు వైద్యం చేశారు. పాము కాటు వేసిన వెంటనే రావడం వలన ప్రాణాపాయం నుండి బయటపడ్డాడని, పెద్ద ప్రమాదం ఏమీ లేదని, అయినా మెరుగైన చికిత్స కోసం కర్నూలు పెద్ద ఆసుపత్రికి వెళ్లాలని వైద్యులు సూచించారు.