సామాన్యులకు.. కార్పొరేట్ వైద్యం..
1 min readపేదలకు, ట్రాన్సజెండర్స్ కు ఉచిత వైద్యం
- ఆరోగ్య శ్రీ, ఈహెచ్ఎస్, ఇన్సూరెన్స్ కింద అందుబాటులో వైద్యం
- డాక్టర్ సి.బి. రమేష్ బాబు, రమేష్ హాస్పిటల్ అధినేత
కర్నూలు, పల్లెవెలుగు: వైద్యరంగంలో రాణించే ప్రతిఒక్కరూ పేదలకు సేవ చేయాలన్న తలంపుతో రావాలన్నారు సిబి ఆర్ రమేష్ హాస్పిటల్ అధినేత డా. సి. రమేష్ బాబు. మంగళవారం ఆయన ఛాంబరులో విలేకరులతో మాట్లాడారు. రమేష్ హాస్పిటల్ లో అన్ని వ్యాధులకు సంబంధించి వైద్య చికిత్సలు అందించేందుకు వైద్య నిపుణులు ఉన్నారని, పేదలకు నాణ్యమైన … కార్పొరేట్ వైద్యం అందించడమే తమ లక్ష్యమన్నారు. నగరంలోని ఢీ మార్ట్ పక్కన ఐదేళ్ల క్రితం ప్రారంభించిన రమేష్ హాస్పిటల్ అంచలంచెలుగా ఎదిగిందన్నారు. ఇక్కడికి రాయలసీమతోపాటు కర్ణాటకలోని రాయచూరు, శిరుగుప్ప, బళ్లారి, తెలంగాణ లోని హైదరాబాద్, మహబూబ్ నగర్, గద్వాల, అలంపూర్, కొత్తకోట తదితర ప్రాంతాల నుంచి వచ్చి వైద్య సేవలు పొందుతున్నారన్నారు. పేదలకు , ట్రాన్స్ జెండర్స్ కు ఉచిత వైద్యం అందిస్తామన్న డా. రమేష్ బాబు… డబ్బు తక్కువగా ఉందని చెప్పిన వాళ్లకు కూడా వైద్యం చేసి పంపుతామన్నారు. తమను నమ్మి వచ్చిన వాళ్లకు డబ్బు ఉన్నా.. లేకున్నా.. నాణ్యమైన వైద్యం అందజేయడం బాధ్యతగా భావిస్తామన్నారు. గైనకాలజిస్ట్, మధుమేహ వ్యాధి, చిన్న పిల్లల వైద్యలు, మెదడు, నరాల వ్యాధి, ఊపిరితిత్తులు, కిడ్నీ, గుండెకు సంబంధించిన వైద్య నిపుణులు తమ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారన్నారు. ఆరోగ్యశ్రీ , ఈహెచ్ఎ స్, ఇన్సూరెన్స కింద వైద్యం అందిస్తామని పేర్కొన్న ఆయన… సదరు బాధితులతో పైసా కూడా వసూలు చేయమని స్పష్టం చేశారు. ప్రస్తుతం కార్పొరేట్ వైద్యం అందించే వాటిలో రమేష్ హాస్పిటల్ లో కూడా ఒకటి అని చెప్పుకోవడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా డా. రమేష్ బాబు వెల్లడించారు.