PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గొర్రెల మేకల పెంపకం దారుల సొసైటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం                     

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం దారుల సొసైటీ చైర్మన్ కురువ శ్రీనివాసులు మంగళవారం కర్నూలు సమర్థత వైద్యశాలల్లో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. గొర్రెల, మేకల పెంపకందార్ల సమాఖ్య రాష్ట్ర మాజి చైర్మన్  సభా అధ్యక్ష్యతన కర్నూలు నగరంలోని పశుసంవర్ధక శాఖ పశువైద్యశాల కార్యాలయం యందు నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. కురువ శ్రీనివాస్  కర్నూలు జిల్లా గొర్రెల మేకల పెంపకందార్ల సమాఖ్య చైర్మన్ గా ప్రమాణస్వీకారo చేశారు.  గొర్రెల మేకల పెంపకందార్ల కర్నూలు జిల్లా కమిటీ సభ్యులు వైస్.చైర్మన్ – గుర్రప్ప యాదవ్, జడ్.పి.టి.సి సుంకన్న, రామాంజనెయులు, డైరెక్టర్లు – ఎం.కె.మద్దిలెటి, కె.రాముడు, అయ్యన్న యాదవ్, హనిమిరెడ్డి, యగంధర్ ప్రసాద్, శ్రీనివస యాదవ్, కుపేంద్ర యాదవ్, మద్దయ్య యాదవ్, వెంకటేశ్వర్లు యాదవ్, ఎన్.చంద్ర శేఖర్ మొదలగు వారు ప్రమాణస్వీకారం చేశారు.ఈ కార్యక్రమానికి కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి,  పత్తికొండ శాసనసభ్యులు  K.E.శ్యామ్ కుమార్, కర్నూలు పార్లమెంట్ సభ్యులు శ్రీ బస్తిపాటి నాగరాజు, కోడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *