స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు హోల్ సేల్ మార్కెటింగ్ కల్పించాలి
1 min readజిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : జిల్లాలో స్వయం సహాయక సంఘాల మహిళలు తయారుచేసే ఉత్పత్తులకు హోల్ సేల్ మార్కెటింగ్ కల్పించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా డి ఆర్ డి ఎ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించే అంశంపై కలెక్టర్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్భంగా హోళగుంద మండలం నెరణికి గ్రామానికి చెందిన తోటదళ బసవేశ్వర గ్రూపు ఎస్ హెచ్ జి మహిళలు తయారుచేసిన జ్యూట్ బ్యాగులను కలెక్టర్ కు చూపించారు.. కలెక్టర్ స్పందిస్తూ జిల్లాలో ఎస్ హెచ్ జి మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించే అంశంపై చిత్తశుద్ధితో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. మహిళలు తయారుచేసిన ఉత్పత్తులకు వ్యాపార అవకాశాలు పెరిగే విధంగా లోకల్ మార్కెట్ తో లింక్అప్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.. రేపటినుండి ఏపీఎంలు కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు పట్టణాల్లో మార్కెట్ ను స్టడీ చేసి ఆయా షాపులు, సూపర్ మార్కెట్ లకు మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను టై అప్ చేయాలని కలెక్టర్ డి ఆర్ డి ఎ పి డి శ్రీధర్ రావును ఆదేశించారు.. పది రోజు లోపల ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను తనకు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే కార్మిక శాఖ సహకారంతో అన్ని షాపులు, సూపర్ మార్కెట్ల యాజమాన్యాలతో ఉత్పత్తులను టై అప్ అంశంపై చర్చించేందుకు ఒక సమావేశం ఏర్పాటు చేయించాలని కలెక్టర్ ఆదేశించారు.. అదే రోజున మహిళలు తయారుచేసిన ఉత్పత్తులతో ఒక ఎగ్జిబిషన్ ను ఇక్కడ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, సిపిఒ హిమ ప్రభాకర్ రాజు, అధికారులు పాల్గొన్నారు.