పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి
1 min readఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్
జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి తో మొక్కలు నాటిన ఎంపీ
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : పర్యావరణ పరిరక్షణలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ మహేష్ కుమార్ అన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా బుదవారం స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలు ఆవరణలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తో కలిసి ఎంపీ మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఎంపీ మహేష్ కుమార్ మాట్లాడుతూ భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ఇందుకోసం ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలన్నారు. పుట్టినరోజు వంటి కార్యక్రమాలలో మొక్కలను నాటడం ఒక అలవాటుగా చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, జిల్లా పరిషత్ సీఈఓ కె. సుబ్బారావు, డిఆర్డిఏ పీడీ విజయరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) మొదటి సమావేశానికి విచ్చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు పూలమొక్కను అందించి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి స్వాగతం పలికారు.