బాల్య వివాహాలపై విద్యార్థులకు అవగాహన..
1 min readఅధికారులకు ప్రజా ప్రతినిధులకు విద్యార్థులకు అవగాహన
జిల్లా సంరక్షణ అధికారి శ్రీనివాస్
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా పగడ్యాల మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో బుధవారం ఎంపీపీ మండ్ల మల్లేశ్వరి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది.ఈ సమావేశానికి నంద్యాల జిల్లా సంరక్షణ మరియు స్త్రీ,శిశు సంక్షేమ శాఖ అధికారి కే శ్రీనివాస్,జడ్పిటిసి పుల్యాల దివ్య మరియు ఎంపీడీవో సుమిత్రమ్మ,అంగన్వాడీ సీడీపీఓ కోటేశ్వరమ్మ మరియు వివిధ శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా సంరక్షణ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ బాలికలకు బాల్య వివాహాలు చేయటం వల్ల కలిగే నష్టాల గురించి అధికారులకు మరియు వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులకు ఆయన వివరించారు.తర్వాత కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులకు బాల్య వివాహాలపై అంగన్వాడీ సూపర్ వైజర్ శేషమ్మ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు లో సంరక్షణ అధికారి మాట్లాడుతూ బాలికలు మంచి చదువుతో ముందుకు వెళ్లాలని మీరు అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకొని ఒక స్థాయిలో ఉండే విధంగా మీరు నిలబడాలని అంతేకాకుండా బాలికలకు చిన్న వయసులో వివాహాలు చేయకూడదని అలా చేస్తే ఆరోగ్యపరంగా దెబ్బతినే అంశాల గురించి వివరించారు.ఆడపిల్లలను రక్షిద్దాం- ఆడపిల్లలను చదివిద్దాం లైంగిక నేరాలు నుండి పిల్లలకు రక్షణ మరియు బాల్య వివాహాల నిరోధక చట్టాల గురించి ఆయన విద్యార్థులకు అవగాహన కల్పించారు. బాలికలకు 18 సం.లు బాలురకు 23 సంవత్సరాలు పైబడిన తర్వాతనే వివాహాలు చేయాలని సిడిపిఓ కోటేశ్వరమ్మ అన్నారు.ఈ కార్యక్రమంలో కస్తూరిబా పాఠశాల ఎస్ఓ ఉషా, మహిళా పోలీసు సుజాత మరియు పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.