PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం…

1 min read

తల్లికి వందనం (అమ్మఒడి) ఊసే ఎత్తడం లేదు…

ఫీజు రీయంబర్స్ మెంట్ పై నోరు మెదపడం లేదు…

పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు:

పల్లెవెలుగు వెబ్ ఆలూరు:   నాడు విప్లవాత్మక మార్పులతో కలకళలాడిన సర్కారు బడులు నేడు కూటమి ప్రభుత్వ పాలనలో మసక బారుతున్నాయని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. జగన్ పాలనలో  నాడు-నేడు, ఇంగ్లీష్  మీడియం,  ఐబీవైపు అడుగులు,  సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్‌, తరగతి గదుల్లో 6వ తరగతి నుంచి ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ పానల్స్‌, 8వ తరగతి వచ్చే సరికే ట్యాబుల పంపిణీ, విద్యాకానుక, రోజుకో మెనూ తో గోరుముద్ద… ఇలా పేద పిల్లల తలరాతలను మార్చే చదువులను అందించడానికి ఎన్నో కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశారన్నారు. నాడు నేడుతో కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పరచడం జరిగిందని,డిజిటల్ క్లాస్ రూమ్స్ లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అయితే కూటమి పాలనలో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ అధ్వాన్నంగామారుతోందన్నారు.  జగన్ హయాంలోని విద్యా  పథకాలను ఒకొక్కటిగా రద్దు చేస్తూ వస్తున్నారన్నారు.  పలుచోట్ల తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపడం మానేస్తున్నారని, ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు.  జగన్ పాలనలో ప్రయివేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోకి ప్రవేశాలు అధికంగా జరిగాయని ఆయన గుర్తు చేశారు. మధ్యాహ్న భోజనంలో రుచి, శుచీ మాయమవుతోందన్నారు. ఉపాధ్యాయుల సర్దుబాటు తూతూమంత్రం గా  ఉండడం తో బోధన అస్తవ్యస్తమైందన్నారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు అరకొర నిధులును మాత్రమే ఈ ప్రభుత్వం మంజూరు చేస్తోందన్నారు.

విద్యా పథకాలు అందకపోవడంపై విద్యార్థుల్లో ఆందోళన…

 పిల్లలు, తల్లులను పచ్చిగా కూటమి  ప్రభుత్వం  మోసం చేస్తోందని, అది తల్లికి వందనం కాదని పిల్లలు, తల్లులకు పంగనామం అన్నట్లుగా వ్యవహరిస్తోందని ఆయన దుయ్యబట్టారు. ప్రజలందరినీ వంచనకు గురి చేస్తోందన్నారు. నీకు పదిహేను, నీకు పదిహేను, నీకు పదిహేను  .. ఇంట్లో ఒక్కో పిల్లాడిని చూపిస్తూ.. కూటమి   ప్రభుత్వం రాగానే.. ఇలా అందరికీ రూ.15 వేలు చొప్పున ఎందరు పిల్లలు ఉంటే అంత మందికి కలిపి ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించి ఇప్పటి వరకూ ఇవ్వకపోవడం ఏంటని ఆయన ప్రశించారు. పెండింగ్ లో ఉన్న విద్యార్థుల ఫీజు  బకాయిలను కూటమి ప్రభుత్వం త్వరగా చెల్లించాలని ఆయన  డిమాండ్ చేశారు.కళాశాల ఫీజు,హాస్టల్, మెస్ ఫీజులు చెల్లించలేక విద్యార్థులు సతమతమవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఫీజులు కట్టాలని ఇప్పటికే కొన్ని కళాశాలలు విద్యార్థులను వేధిస్తున్నాయన్నారు. అదే ముఖ్యమంత్రిగా  జగన్ ఉండి ఉంటే  సక్రమంగా అమ్మఒడి అందేదని, క్వార్టర్ ముగియ గానే ఫీజు రీయంబర్స్ మెంట్ ,వసతి దీవెన, విద్యాదీవెన లకు డబ్బులును నేరుగా తల్లుల ఖాతాల్లో వేసేవారని అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు బాహాటంగానే చెప్పుకుంటున్నారన్నారు.విద్యార్థుల సంక్షేమం కోసం జగన్ పాలనలో.. విద్యార్థుల సంక్షేమం కోసం జగన్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా పలు పథకాల  లబ్ది ని ఆయన వివరించారు.జగనన్న అమ్మఒడి పథకంలో 44,48,865 మందికి రూ.26,067.30 కోట్లను జమ చేశారు. జగనన్న వసతి దీవెనలో 25,17,245 మందికి రూ.4,275.76  కోట్లను అందించారు. జగనన్న విద్యా దీవెన పథకంలో 26,98,728 మందికి రూ. 12,609.68 కోట్లను అందించారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంలో 408 మందికి రూ.107.07 కోట్లను ఇచ్చారని తెలిపారు.చంద్రబాబు పెండింగ్ ఫీజు బకాయిలును క్లియర్ చేసిన జగన్ ప్రభుత్వం… 2017-2018, 2018-2019  విద్యాసంవత్సరాలలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోని ఫీజు బకాయిలు  కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2019-2020 విద్యాసంవత్సరంలో విడుదల అయ్యాయన్నారు.అలాగే కుటుంభ వార్షికాదాయాన్ని కూడా అప్పటి టిడిపి ప్రభుత్వం రూ 1 లక్షగా నిర్థారిస్తే, వీలైనంత ఎక్కువ మందికి ప్రయోజనం చేకూర్చాలనే సదుద్దేశ్యంతో జగన్ ప్రభుత్వం వార్షికాదాయం రూ 2.50 లక్షల వరకూ వున్నా  లబ్ది చేకూరేలా చేసిందన్నారు.ఈ నేపథ్యంలో వసతి దీవెన పథకం ద్వారా ఐటిఐ విద్యార్థులకు రూ 10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ 15 వేలు,డిగ్రీ,ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులకు రూ 23 వేలు ప్రకారం అందించి విద్యార్థులకు జగన్ తోడ్పాటు అందించారన్నారు. తిరోగమన నిర్ణయాలతో ప్రభుత్వ బడులను మళ్లీ మొదటికే తీసుకెళ్తున్నట్లుగా ఉంది… ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని పథకాల రద్దుతో పేద పిల్లల నాణ్యమైన విద్యకు  గండికొడుతున్నారన్నారు. సీఎంగా చంద్రబాబు, విద్యాశాఖ మంత్రిగా లోకేశ్ తిరోగమన నిర్ణయాలతో ప్రభుత్వ స్కూళ్లను మళ్లీ మొదటికే తీసుకెళ్తున్నారని ఆరోపించారు. మీ ఇళ్లల్లో పిల్లలకు అత్యుత్తమ చదువులు అందించాలను కుంటారు కానీ, గవర్నమెంటు స్కూలు పిల్లల విషయంలో వివక్ష ఎందుకు? అని ప్రశ్నించారు.గవర్నమెంటు స్కూళ్లలో ఇంగ్లిషు మీడియంను వ్యతిరేకిస్తూ కోర్టులకు వెళ్లి అడ్డుకున్న తీరును ఇప్పటికీ ప్రజలు  మరిచిపోలేరని బి .విరుపాక్షి వివరించారు.

About Author